జైలు పాలైన రియా … బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తి జైలు పాలయ్యారు. డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు నిర్ధారణ కావడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియాను అరెస్ట్ చేశారు. రియాను ఎన్‌సీబీ అధికారులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయ స్థానం ఆమెకు ఈ నెల 22వరకూ 14రోజుల రిమాండ్‌ విధించింది. తొలిరోజు ఎన్‌సీబీ కార్యాలయంలో గడపనున్న రియాను బుధవారం ఉదయం పది గంటలకు బైకులా జైలుకు తరలిస్తారు. రియా సోదరుడు షౌవిక్ కూడా ఇప్పటికే అరెస్టయ్యాడు.

మరోవైపు రియా డ్రగ్స్ విషయంలో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం.

జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ కేసులో ఆయన ప్రేయసి రియాపై ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ డబ్బులను వాడుకుని, ఆ తర్వాత ఆయన్ను ఆత్మహత్యకు పురికొల్సారని రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*