కృష్ణ బియ్యంతో ఊబకాయం మటుమాయం

కృష్ణ బియ్యం (బ్లాక్ రైస్)లో అనేక పోషక విలువలు
కృష్ణ బియ్యం : కొవ్వు పదార్థం జీవక్రియల పాత్ర

హైదరాబాద్: ఊబకాయం (ఒబెసిటీ) అనేక దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మానవులను ప్రభావితం చేస్తోంది. ఇది జీవక్రియల సంబంధిత వ్యాధి లక్షణాల
సంపుటి (మెటబాలిక్ సిండ్రోమ్స్)తో వస్తుంది. అధిక రక్తపోటు, హై బ్లడ్ సుగర్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి మెటబాలిక్ సిండ్రోమ్స్‌‌తో వస్తుంది.

ఊబకాయానికి చికిత్స కోసం అనుమతించిన అనేక ఔషధాలను ఇప్పుడు ఉపసంహరించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అస్వస్థతలు వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నందు వల్ల ఈ మందుల వాడకాన్ని ఉపసంహరించారు.

ఔషధాల సంబంధం లేకుండా ఊబకాయంతో పోరాడేందుకు అత్యంత సమర్థంగా ఉపయోగపడుతున్న పద్ధతి నియంత్రిత ఆహార స్వీకరణ, ఎనర్జీ ఎంగేజ్‌మెంట్‌ను నిరోధించడం, శారీరక కార్యకలాపాలను పెంచడం. ఊబకాయంతో పోరాడటానికి మొక్కల నుంచి పెద్ద సంఖ్యలో బయోయాక్టివ్
కాంపొనెంట్స్‌ను గుర్తించారు.

కృష్ణ బియ్యం (బ్లాక్ రైస్)లో అనేక పోషక విలువలు, బయో యాక్టివ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే…

i) యాంథోసయనిన్స్ (ప్రధానంగా సయనిడిన్-3, 5 డిగ్లూకోసైడ్, సయనిడిన్-3, ఓ-గ్లూకోసైడ్, పెటునిడిన్-3-ఓ-గ్లూకోసైడ్),

ii) ఫెనోలిక్ యాసిడ్స్ (ప్రధానంగా ప్రోటోకాటెచూయిక్ యాసిడ్, 2,5 డైమైడ్రాక్సీబెంజాయిక్ యాసిడ్, వనిలిక్ యాసిడ్),

iii) డైటరీ ఫైబర్స్ (ప్రధానంగా రెసిస్టెంట్ స్టార్చ్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్),

iv) రిఫైన్‌డ్ వైట్ రైస్‌తో పోల్చినపుడు పొట్టు, ఎంబ్రియోలలోని మినరల్స్ (ప్రధానంగా Fe, Ca, Zn, K, Cu, and Mg).

ప్రస్తుతం కృష్ణ బియ్యంపై అధ్యయనాలు అత్యధికంగా ప్యూరిపైడ్ యాంథోసయనిన్స్, మెటాబోలిక్ సిండ్రోమ్స్ మధ్య సంబంధంపై దృష్టి సారిస్తున్నాయి.

కృష్ణ బియ్యం మానవుల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి వచ్చినపుడు రక్త నాళాల లోపలి భాగంలో గార (ప్లేక్) పడుతుంది.
రక్తంలో కనిపించే కొవ్వు, కొలెస్టరాల్, కాల్షియం, ఇతర పదార్థాలతో ఈ గార పడుతుంది. కాలం గడిచే కొద్దీ ఈ గార గట్టిపడుతుంది, రక్త నాళాలను
సంకోచింపజేస్తుంది. దీనివల్ల ప్రాణవాయువు (ఆక్సిజన్)తో కూడిన రక్తాన్ని శరీరంలోని అవయవాలకు ప్రవహించడాన్ని పరిమితం చేస్తుంది.

కుందేళ్ళకు కృష్ణ బియ్యం, తెల్ల బియ్యం ఆహారంగా ఇచ్చి నిర్వహించిన అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. 30 శాతం
(డబ్ల్యూ/డబ్ల్యూ) కృష్ణ బియ్యంతో హై కొలెస్టరాల్ ఆహారం ఇచ్చినపుడు, అదే మోతాదు తెల్ల బియ్యం ఇచ్చినప్పటితో పోల్చినపుడు కృష్ణ బియ్యం
వాడటం వల్ల అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ లెవెల్ తగ్గినట్లు వెల్లడైంది.

హైపర్‌ కొలెస్టెరోలెమియా (రక్త ప్రవాహంలో అతి కొలెస్టరాల్)
హైపర్‌ కొలెస్టెరోలెమియా నియంత్రణలో కృష్ణ బియ్యం (ఒరిజా సటీవా ఎల్.) పాత్రను పరిశీలిద్దాం. అంతకన్నా ముందు మనం కొన్ని బయలాజికల్
పదాలను అర్థం చేసుకుందాం.

హెచ్‌సీఎల్ అంటే ఏమిటి? హైడెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డీఎల్), లేదా ‘‘గుడ్ కొలెస్టరాల్’’ కొలెస్టరాల్‌ను పీల్చుకుంటుంది. దానిని తిరిగి కాలేయానికి
తీసుకెళ్తుంది. అప్పుడు కాలేయం దానిని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. హెచ్‌డీఎల్ కొలెస్టరాల్ అత్యధిక స్థాయిలో ఉంటే హార్ట్ డిసీజ్, స్ట్రోక్
ప్రమాదాలు తగ్గుతాయి.

ఎల్‌డీఎల్ అంటే ఏమిటి? రక్తనాళాల్లోని గోడల వద్ద చేరుతుంది కాబట్టి లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్) కొలెస్టరాల్‌ను ‘‘బ్యాడ్’’ కొలెస్టరాల్
అంటారు. దీనివల్ల హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

లిపిడ్ మెటాబొలిజం (కొవ్వు పదార్థం జీవక్రియలు)లో హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డీఎల్) పాత్ర :
– ప్లాస్మా లిపిడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో హెచ్‌డీఎల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
– హెచ్‌డీఎల్ ముఖ్యమైన కార్యకలాపం ఏమిటంటే, కాలేయానికి కొలెస్టరాల్‌ను తీసుకెళ్ళడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. కాలేయంలో దీని
జీవక్రియలు జరుగుతాయి.

జర్మినేటెడ్ బ్లాక్ రైస్ తీసుకున్న ఎలుకల్లో హెచ్‌డీఎల్ లెవెల్స్‌లో పెరుగుదల వల్ల జర్మినేషన్ ప్రాసెస్ వల్ల లిపిడ్ మెటాబొలిజం వృద్ధి చెందినట్లు వెల్లడైంది. ఎల్‌డీఎల్ లెవెల్స్ తగ్గుదలను కూడా పరిశీలించినపుడు తెలిసినది ఏమిటంటే, కృష్ణ బియ్యం, బ్రాన్ ఆయిల్ కలిసిన ఆహారం తిన్న
ఎలుకల్లో కొలెస్టరాల్, ఎల్‌డీఎల్ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని వెల్లడైంది.

హెపటిక్ కొలెస్టరాల్ (లివర్ ఫ్యాట్) : అన్ రిఫైన్డ్ బ్లాక్ రస్ ఆహారం తీసుకున్న జంతువుల హెపటిక్ కొలెస్టరాల్ స్థాయులు 30 రోజుల తర్వాత, ఈ ప్రయోగం ప్రారంభంతో పోల్చుకుంటే, తగ్గినట్లు వెల్లడైంది. బ్లాక్ రైస్ డైట్ తీసుకున్న గ్రూప్ లెవెల్స్ 14.6 శాతం తగ్గిందని వెల్లడైంది.

జర్మినేటెడ్ బ్లాక్ రైస్‌తో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో హెపటిక్ కొలెస్టరాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

కృష్ణ బియ్యం, దాని అనుబంధ ఆహార వినియోగం వల్ల లిపిడ్ పెరోక్సిడేషన్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ నుంచి కాలేయానికి రక్షణ లభిస్తుందని
తెలిసింది.

ఈ ఫలితాల వల్ల వెల్లడైనది ఏమిటంటే, లిపిడ్ మెటాబొలిజానికి దోహదపడే ముఖ్యమైన లక్షణాలు కృష్ణ బియ్యంలో ఉన్నట్లు స్పష్టమైంది.

కొలెస్టరాల్‌ను సెల్స్, టిష్యూల నుంచి పైత్య రసం చర్యలు జరిగే కాలేయానికి తీసుకెళ్ళడంలో సహాయపడుతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రక్రియ వల్ల మల విసర్జన సమగ్రంగా జరిగే అవకాశాలను పెంచుతుందని తేలింది.

-Meghana Naidu Devanaboina, MSc. Food Technology (spl. Forensic food analysis),
Gujarat Forensic Sciences University (GFSU)