
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోమారు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో విభాగంలో ఆయన్ను చేర్పించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గతంలో పాజిటివ్ వచ్చినప్పుడు షా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ శ్వాసపరమైన ఇబ్బందులు రావడంతో ఆయన తిరిగి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. షా త్వరగా కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కావాలని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Be the first to comment