
హైదరాబాద్: ప్రముఖ కవి, టీవీ, సినీగేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ కాళోజీ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ సాహిత్య కళా పీఠం సిద్దిపేట వారు వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్న కళాకారులను కాళోజీ జాతీయ పురస్కారాలతో సత్కరించారు. ఈ సంవత్సరం 12 మందికి ఈ అవార్డును అందజేసారు. పాటల రచన విభాగంలో మౌనశ్రీ మల్లిక్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు దాసరి శాంతకుమారి తెలిపారు.
సెప్టెంబర్ 13 న జరిగిన వెబినార్‌లో మల్లిక్ పురస్కారాన్ని స్వీకరించారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్, పొట్లూరి హరికృష్ణ తదితరులు మల్లిక్‌ను ఉత్తమ శ్రేణి కవి, గేయ రచయిత అని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.