
“సడన్ గా మీకు తెలియకుండా ఒక వస్తువుపై లేదా పాము, బల్లి ఇలాంటి వాటిపై కాలు వేశారు అనుకోండి!”
“ఊరికే అరిచే వాళ్ళని చూస్తే?”
“మిమ్మల్ని చూడగానే మొహం చిట్లించుకునేవాళ్ళు ఎదురైతే?”
“చిన్నప్పుడు ఎదురైన ఏదైనా ఇన్సిడెంట్ గుర్తొస్తే?”
“టీవీ లో రకరకాల వార్తలు, హారర్ షోలు వర్ణించి వర్ణించి ఊరికే చూపిస్తూ ఉంటే?”
“అమ్మో అప్పుడే 1st వచ్చేస్తోంది అని సడన్ గా గుర్తొస్తే?”
అందరిలో కలిగే భావం ఏమిటి?
ఒకలాంటి “భయం!”
మనలో ఉండే 5 ప్రాథమిక అంటే బేసిక్ ఎమోషన్స్ లో ఒకటైన భయం గురించి…
ఎందుku? ఏమిti? ఎలాga?
భయం, బతకడానికి మంచిదే!
అది survival instinct కూడా.
Safe గా operational గా ఉంచడానికి పనికొస్తుంది.
నెర్వస్ గా ఫీల్ అవ్వడం వేరు… భయం వేరు…
భయం ఒక రుగ్మతగా ఎప్పుడు మారుతుందో తెలుసుకోవడం చాలా అవసరం.
ఏదైనా చాలా ‘ఆనందపడే‘ విషయం జరిగినప్పుడు మొదట ఎంజాయ్ చేస్తాం…
తర్వాత అది ఎక్కడ ఉండదో అని ‘భయపడతాం.’
భయం – విచారం కవల పిల్లలు. పోలికలు ఎక్కువ. గుర్తించి సరైన సమయంలో ఆ.. ‘విచారానికి‘ కళ్లెం వేయలేకపోతే అది పెరిగి పెద్దదై ‘అసహ్యం‘ అనే భావాన్ని… కూడా తిప్పుకుంటూ ఉంటుంది.
దాంతో ఏం చేయాలో తెలీకపొతే ‘కోపం‘ ముద్దు పెట్టుకుంది.
అంతే? మనం కరిగిపోయి ‘కోపం‘ తాలూకు ప్రేమ, మత్తులో పడి దాన్నే మన ఆయుధం కింద చేసుకుని బతికేస్తుఉంటాం
అంటే ‘ఆనందం – కోపానికి‘ మధ్య ఇంత గందరగోళం ఉంది. అందుకే ఏది ఎక్కడ ఉండాలో అంటే ఏ emotion ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో, అంతే ఉండాలి.
సరే భయాలు ఎన్ని రకాలు తెలిస్తే గుర్తించడం తేలిక అవుతుంది.
1. జంతువుల పట్ల
2. వానలు ఎండలు చలి తుఫాను లాంటి వాతావరణం వల్ల ఏర్పడేవి
3. రక్తం సర్జరీలు ఇంజెక్షన్లు వగైరా వల్ల వచ్చేది
4. ఇరుకు ప్రదేశాలు విశాల మైదానాలు ఊపిరాడని గుహలు ఇలాంటివి చూసినపుడు
5. లేదా గాల్లో ఎత్తైన ప్రదేశాల నుండి పై నుండి కిందకు చూసినప్పుడు…
ఇవన్నీ ఓకే…
కానీ అసలు విషయం ఏక్కడుందంటే ‘ఊహ‘ లో…
ఫర్ ఎగ్జాంపుల్ ఊహల్లో కొచ్చేది శత్రుభయం, పెద్ద వయసు, ప్రాణభయం, మతపరమైనవి, నిరాకరణ, సంబంధ బాంధవ్యాలు ఆగిపోవడం లేదా తెగిపోతాయి ఏమో అనుకోవడం, ఇలాంటివి. ఊహించుకుని భయపడి దాన్ని రుగ్మతలకు మార్చుకుంటేనే కష్టం.
అసలు భయం ఎక్కడి నుంచి వచ్చిందో… ఎవరి నుండి సంక్రమించిందో…
అంటే…
‘ప్రకృతా? ‘… ‘పెంపకమా? ‘ అన్న డీటెయిల్స్ పక్కన పెట్టేస్తే, దాంతో ఒప్పందం కుదుర్చుకుని, స్నేహం చేసి బతకడం అవసరం.
గమనించాల్సింది భయం అనే emotion కి కుడిఎడమలు…. punishment, guilt.
అంటే శిక్ష వేస్తారేమో, అపరాధ భావం… అనేవి ఉంటాయి.
అలాగే ప్రతి emotion కి ‘ఆకర్షణ‘ – ‘విరక్తి‘ ఉంటుంది దేని పట్ల వెర్రి ఆకర్షణ కలుగుతోందో గ్రహియించగల్గితే దాని పట్ల విరక్తి కూడా అంతే సమానంగా పెంచుకోడానికి ప్రయత్నించినపుడు… ఆ భయం neutral కి వస్తుంది.
For example…
ఎవరైనా ‘కంట్రోల్’ చేయాలనుకున్నట్టు అన్పిస్తే ఆ సిట్యుయేషన్ బట్టీ ‘లొంగిపోండి’
‘భావావేశం’ ఎక్కువగా ఉన్నప్పుడు ‘తర్కం’ పని చేస్తుంది..
‘డ్రామా’ చేస్తున్నారు లేదా చేసే వాళ్ళ దగ్గర ‘ప్రశాంతంగా’ ఉండాలని అనుకుంటూ ఉంటే సరి.
‘భవిష్యత్తు’ తలచుకుంటే భయమేస్తుంది అన్పిస్తే రాబోయే రెండు లేదా మూడు గంటల గురించి తప్ప దృష్టి పెట్టకండి.
ఎవరైనా మిమ్మల్ని avoid చేస్తున్నారు, చేస్తారు అనుకుంటే వాళ్ళని అంగీకరించండి, లేదా వాళ్ళకి దూరంగా ఉండండి.
ఎవరైనా విస్తృతంగా, విశదీకరించి చెప్తుంటే దానికి మీ ఊహ జోడించి అనవసరంగా ఇంకా ఎక్కువ జ్ఞానం పెంపొందించుకోవాలని చూడకండి.
సరే, ప్రస్తుతానికి చాలేమో !
అన్నట్టు నేనూ చిన్న పిసరు భయపడుతూనే రాసానండి ఈ article..
మళ్ళీ కలుద్దాం.
-స్రవంతి చాగంటి.
Be the first to comment