అక్టోబర్‌లో విడుదల కానున్న కీర్తి సురేష్ ‘ఐనా ఇష్టంనువ్వు’

హైదరాబాద్: సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ”ఐనా ఇష్టంనువ్వు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. తొలుత దీనికి ”ఐనా…ఇష్టం నువ్వు”. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ దేవ్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్, సంగీతం: అచ్చు, నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం రాంప్రసాద్ రౌతు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*