
న్యూఢిల్లీ: కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలశాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లి ఆమె రాజీనామా సమర్పించారు.
I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020
వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో బిల్లులకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి ఎన్డీఏలో కొనసాగేందుకు అకాలీదళ్ తీర్మానం చేసింది
Shiromani Akali Dal strongly opposes the #AgricultureBill: SAD President Sukhbir Singh Badal in Lok Sabha pic.twitter.com/vN3uoyS03b
— ANI (@ANI) September 17, 2020
ఈ వారం ప్రారంభంలో ఎన్డీయే ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్రం తెచ్చిన ఫార్మర్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు-2020 (సాధికారత, పరిరక్షణ), నిత్యావసర వస్తువుల సవరణ బిల్లులు తెచ్చింది.
Be the first to comment