
హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎగుమతుల అభివృద్ధి సంస్థ సభ్యుడిగా హైదరాబాద్కు చెందిన శీలం మధుబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈ ఈపీసీ ఛైర్మన్ హరినారాయణ్ రాజ్ భర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంఎస్ఎంఈ ఈపీసీ సభ్యుడిగా షెడ్యూల్ కులానికి చెందిన తన నియామకానికి సహకరించిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులకు మధుబాబు కృతజ్ఢతలు తెలిపారు. తెలంగాణలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని, ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తానని మధుబాబు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన మధుబాబు ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. బాచుపల్లిలో అవని బయో లైఫ్ సైన్సెస్ పేరిట మూడేళ్లుగా ఎంఎస్ఎంఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు.
Be the first to comment