కేంద్ర మంత్రి కన్నుమూత.. ఇప్పటివరకూ నలుగురు ఎంపీల ప్రాణాలు బలిగొన్న కరోనా

న్యూఢిల్లీ:న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూశారు. రైల్వే శాఖసహాయ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఇంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కర్ణాటక బెల్గామ్ జిల్లాలో ఆయన బీజేపీని పటిష్టపరిచేందుకు కృషిచేశారు. 2004, 2009, 2014, 2019లో ఆయన లోక్ ‌సభ ఎంపీగా గెలిచారు. లా గ్రాడ్యుయేట్ అయిన సురేశ్‌కు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు.

సురేశ్ మృతిపై రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.

సురేశ్ అకాల మరణంతో తాను షాక్‌కు గురయ్యానని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ చెప్పారు.

కరోనా ఇప్పటివరకూ నలుగురు ఎంపీల ప్రాణాలు తీసుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*