
హైదరాబాద్: పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మహాత్మా గాంధీ కలను నిజం చేసి చూపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఒక జాతీయోద్యమంగా మారడం ఎంతో సంతోషంగా ఉందని శేరిలింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ చెప్పారు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన పారిశుధ్య కార్మికులకు సత్కారం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదిన వేడుకల నేపథ్యంలో చేపట్టిన “సేవహి సప్తాహ” కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ (104) డివిజన్ లోని అంజయ్య నగర్, సిద్దికీ నగర్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో గజ్జల యోగానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డివిజన్ ఇంచార్జి బల్ద అశోక్, డివిజన్ అధ్యక్షులు నీలం జయరాములు అధ్యక్షతన జరిగింది. డివిజన్ నాయకులూ ఆంజనేయులు, మేరీ, వినీత సింగ్, రాము, వెంకట్ నాయక్, వెంకట్ రమణ, నవాజ్ యాదవ్, రెడ్డెమ్మ, హరీష్, మోహిత్, రాజేష్ యాదవ్, లక్ష్మణ్, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to comment