గాన గంధర్వుడు ఎస్పీ బాలు ఇకలేరు

చెన్నై: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయనను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చినా ఆయనను కాపాడలేకపోయారు. 40 రోజులకు పైగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. నాన్న ఇక లేరంటూ ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ అశ్రునాయనాలతో ప్రకటించారు. బాలు కోలుకోవాలంటూ కోట్లాదిమంది అభిమానులు చేసిన ప్రార్ధనలు ఫలించలేదు.

మరోవైపు బాలును చివరి చూపు చూసేందుకు అభిమానులు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్దకు, చెన్నైలోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అటు అధికారులు బాలు నివాసం చుట్టుపక్కల పరిసరాలను ఇప్పటికే పరిశుభ్రం చేశారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*