తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అనుమతి

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవటం కోసం ఐదు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది, బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ. 9,913 కోట్ల మేరకు అప్పు సమీకరించుకోవటానికి అనుమతి లభించినట్టయింది. ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక, త్రిపుర ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ వ్యవస్థకు అవసరమైన షరతు నియమాలను పూర్తిచేసిన మీదట భారత ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

ఆంధ్రప్రదేశ్ – రూ. 2525 కోట్లు

తెలంగాణ – రూ. 2,508 కోట్లు

కర్నాటక – రూ.4,509 కోట్లు

గోవా – రూ.223 కోట్లు

త్రిపుర – రూ. 148 కోట్లు

అనూహ్యంగా వచ్చిన కోవిడ్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అదనంగా ఋణాలు సమీకరించుకోవటానికి అనుమతించింది. అయితే, ఇది 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జిఎస్ డిపి) లో 2శాతం మించకూడదు. ఆవిధంగా మొత్తం రూ. 4,27,302కోట్ల వరకు రాష్ట్రాలు రుణం సమీకరించుకోవచ్చు. ఇందులో 1 శాతం ఈ కింద పేర్కొన్న నాలుగు రాష్ట్ర స్థాయి సంస్కరణలకు కర్చు చేయాలి. ఒక్కో సంస్కరణకు జి ఎస్ డి పి లో 0.25% వెయిటేజ్ లభిస్తుంది.

వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు

వ్యాపార నిర్వహణను సులభతరం చేసే సంస్కరణలు

పట్టణప్రాంత స్థానిక సంస్థ/ వినియోగదారు సేవల సంస్కరణ

విద్యుత్ రంగ సంస్కరణలు

ఇంకా మిగిలిన 1 శాతం అదనపు ఋణ సమీకరణ పరిమితిని రెండు వాయిదాలలో 0.5 శాతం చొప్పున విడుదల చేస్తారు. ముందు అన్ని రాష్ట్రాలకూ కలిపి ఉమ్మడిగా, రెండోవిడత పైన పేర్కొన్న వాటిల్కో కనీసం మూడింటికి ఖర్చు చేస్తామన్న హామీతో విడుదలచేస్తారు. భారత ప్రభుత్వం ఇప్పటికే 0.5 శాతం ఒఎంబి రూపంలో సమీకరించుకోవటానికి 2020 జూన్ లో అనుమతి మంజూరు చేసింది. ఇది రాష్ట్రాలు అందుబాటులో ఉంచిన రూ. 1,06,830 కోట్లకు అదనం.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*