కృషి ఉంటే ఏదైనా సాధించగలం : RJ శ్రావ్య


టిక్ టాక్స్ తో అల్లరి చేస్తుంది
కళ్ళతోనే నవరసాలు పలికిస్తుంది
డాన్స్ చేసినా.. పాటలు పాడినా
ఆమె తర్వాతే ఎవ్వరైనా

రేడియో జాకీగా అలరిస్తూ
Anchor గా అదరగొడుతున్న
RJ శ్రావ్యతో ఈ క్షణం ఇంటర్వ్యూ

హలో శ్రావ్య

మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా?
నమస్తే. నేను రేడియో జాకీ, యాంకర్. పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో. అమ్మానాన్న తమ్ముడు ఉన్నారు. అమ్మ జర్నలిస్ట్. నాన్న అమ్మ ‘కానుక’ అనే పత్రికను స్థాపించారు. మా మేనమామగారు అల్లాణి శ్రీధర్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. నా బెస్ట్ హాఫ్.. చంద్రశేఖర్ రావు కులకర్ణి. ఇద్దరు పిల్లలు.. జయకృష్ణ ఆరేళ్ళు, లక్ష్మి శ్రీజన మూడేళ్లు.


ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్రా మహిళ సభలో చదువుకున్నాను. చిన్నప్పుడు కర్ణాటక శాస్త్రియ సంగీతం నేర్చుకున్నాను. మ్యూజిక్ లో డిప్లొమా చేశాను. కూచిపూడి నేర్చుకున్నాను.


కాలేజీలో మీరు బ్యూటీ క్వీన్ అని విన్నాము.

హహ.. కాలేజీ లో ఫ్రెషర్స్ పార్టీ జరిగినప్పుడు నాకు కాలేజీ బ్యూటీగా, మిస్ AMS గా, మిస్ స్మైల్ గా మూడు అవార్డ్స్ వచ్చాయి.

ఇక డాన్స్, మ్యూజిక్ కూడా వచ్చు కాబట్టి.. ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనేదాన్ని. Anchoring చేసేదాన్ని. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ చాలా చలాకీగా వుండేదాన్ని. ఇవన్నీ చూసి నా స్నేహితులు.. నువ్వు రేడియో జాకీగా, anchor గా ట్రై చెయ్యి అని చెబుతూ ఉండేవారు.

ఫ్రెండ్స్ వల్లే మీరు anchor గా ఎంట్రీ ఇచ్చారన్న మాట.

అవును. నాకు చెప్పకుండానే నా ఫ్రెండ్స్ .. జెమినీ టీవీలో వచ్చే .. లక్స్ డ్రీమ్ గర్ల్ ప్రోగ్రాంకి అప్లై చేసారు. సెలెక్ట్ అయ్యాను. రెండు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి కూడా.


మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు కదా?

ఎస్. మా మమ్మయ్య వల్లే సాధ్యం అయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సీరియల్లో బాల నటిగా కనిపించాను. హీరోయిన్ సౌందర్యతో కలిసి చందన బ్రదర్స్ advertizement లో కనిపించాను. అది ఒక గ్రేట్ మెమరీ నాకు.

మీకు వచ్చిన చాలా అవకాశాలు వదులుకున్నారని తెల్సింది ?

చిన్నప్పుడు అనుమతి ఇచ్చారు గానీ పెద్దయ్యాక స్క్రీన్ పై కనిపించేoదుకు మా ఇంట్లో ఒప్పుకోలేదు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నేను, టీవిలో సెలెక్ట్ అయినట్టు ఇంట్లో చెప్పడానికి కూడా చాలా భయపడ్డాను. జెమినీ టీవీలో ఛాన్స్ వచ్చిన సంగతి తెల్సి అమ్మానాన్న వద్దన్నారు. దీంతో మానేసాను. ఆ తర్వాత ఈటీవి లో ఒక మంచి సీరియల్ లో అవకాశం వచ్చింది. ఇంట్లో ఒప్పుకోరని తెలుసు.. సో, అది వదిలేసా. అలా చాలానే.

పెళ్లి తర్వాత?

పెళ్లి తర్వాత జీవితం మారింది. 20 ఏళ్లకే పెళ్లి అయింది. మాది జాయింట్ ఫ్యామిలీ. మా ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు. ఆయన ప్రోత్సహo వల్లే నేను అనుకున్నది సాధించగలుగుతున్నాను.

రేడియో జాకీ ఎలా అయ్యారు?

డిగ్రీ అయిన వెంటనే RJ సునీల్ దత్ కు చెందిన రేడియో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో రేడియో జాకీగా ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడే ప్రోగ్రామ్స్ చేసేదాన్ని.

ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు, ఎలా చేరారు?

2013లో ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బోలో ఆడిషన్స్ జరుగుతున్నట్టు తెల్సి అప్లై చేశాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో జాకీగా చేస్తున్నాను.

ప్రస్తుతం FM లో ఏ షో చేస్తున్నారు? టైమింగ్స్ ఏంటీ?

నేను ఉదయం 6 -10am ‘వందనం’ అనే ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్నాను.

మీరు రేడియో జాకీ అవుతారని అనుకున్నారా?

అవును, అనుకున్నాను. మనం కచ్చితంగా అనుకుంటే, కృషి ఉంటే ఏదయినా సరే సాధించగలము అనే దాన్ని బలంగా నమ్ముతాను.

రేడియోలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది?

‘మీరే గనక రియల్ హీరో అయితే’ అన్న టాపిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీ టీవీ జర్నీ ఎలా మొదలయింది?

2017లో DD యాదగిరిలో చేరాను. మెట్రో న్యూస్ anchor గా ఆరు నెలలు చేశాను.

యూట్యూబ్ ఛానల్ లో కూడా జాబ్ చేసేవారు కదా?

నేను యూట్యూబ్ లోకి అడుగుపెడతాను అని అస్సలు అనుకోలేదు. ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నా అంతే. RJ lucky ఇచ్చిన సమాచారంతో, RJ గీత ప్రోత్సాహంతో .. సుమన్ టీవీలో జాయిన్ అయ్యాను. అక్కడ MD సుమన్ గారు, CEO పద్మజ గారు.. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేయమని నన్ను ఎంకరేజ్ చేసేవారు. అలా anchoring చేయడం మొదలయింది.

యూట్యూబ్ లో చాలామందిని ఇంటర్వ్యూ చేసి వుంటారు, అందులో మీకు బాగా నచ్చింది

అలనాటి నటి జమునతో చేసిన ఇంటర్వ్యూ ఎప్పటికి మర్చిపోలేను.

ఆ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

శోభా రాజ్ ఇంటర్వ్యూ, టీవీ స్టార్ కపుల్ ఇంద్రనీల్ – మేఘన ఇంటర్వ్యూ నాకు మంచి పేరు తెచ్చింది.మర్చిపోలేని ఇంటర్వ్యూ?

టీవీ anchor గా మా మేనమామను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అందుకు ఎంతో సంతోషపడ్డా… గుండెల్లో టెన్షన్. ప్రశ్నలు అడుగుతుంటే చెమటలు పట్టాయి.


మీరు టిక్ టాక్ స్టార్ట్ కూడా కదా?

నాకు డాన్స్, మ్యూజిక్ ప్రాణం. ఫోక్ సాంగ్స్ కూడా పాడతాను. టిక్ టాక్ వున్నప్పుడు సరదాగా చాలా వీడియోస్ చేశాను.

మీ జీవితంలో రేడియో తెచ్చిన మార్పు ?

రేడియో నాలో ఓర్పు అనే మార్పును తెచ్చింది. అంతమంది శ్రోతలు మనల్ని వింటున్నారు అన్న ఫీలింగ్ గర్వంగా ఉంటుంది. అందుకే ప్రతి షో కన్నా ముందు స్క్రిప్ట్ పై వర్క్ చేస్తాను.

మీ ఇన్స్పిరేషన్?

చాలామందే ఉన్నారు. మా అమ్మలోని ధైర్యం. Anchor సుమ అక్కలో ఉన్న చమత్కారం. మా ఆయనలోని పాజిటివ్ నెస్. రేడియో జర్నీలో సహాయపడ్డ RJ సునీల్ దత్ …అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ఎందరో నాకు ఒక ఇన్స్పిరేషన్.

మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది?

అందరినీ గుడ్డిగా నమ్మడం

మీలో మీకు నచ్చేది

అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుకుని పోవడం

మీ ఫ్యూచర్ ప్లాన్స్?

ఏదైనా సరే అందరిలా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు పొందాలి అని. ఒక మంచి తెలంగాణ anchor అనిపించుకోవడం.

RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్

రేడియో జాకీ అవ్వాలి అనుకుంటే, మంచి గొంతు, భాష, వాయిస్ కల్చర్ చాలా అవసరం. ఇవ్వనింటికి మించి ధైర్యం, పట్టుదల, కృషి ఈ మూడు ఏ ఫీల్డ్ లో అయినా సరే రాణించడానికి మన వెన్ను తట్టి నిద్ర లేపుతాయి.

చివరగా మీరు చెప్పాలని అనుకుంటున్నది?

Anchoring ఫీల్డ్ లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని ట్రై చేస్తున్నాను. అందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాను. పెళ్లి అయింది కదా అని కొన్ని చోట్ల నాకు జాబ్ ఆఫర్ చెయ్యట్లేదు. పెళ్లి అయితే anchoring చేయకూడదా? పెళ్లి టాలెంట్ కి అడ్డు రాదు. ఈ విషయం అందరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతే నేనే సొంతంగా విజయానికి బాటలు వేస్తాను. నాపై నాకు నమ్మకం ఉంది. నా టాలెంట్ నాకు కొండంత ధైర్యం.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*