ఎంత ఎక్కువ చదివారన్నది కాదు.. ఎంత చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నది ముఖ్యం: డాక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మీ

వ్యక్తిత్వ వికాసం..

పరిసరాలు, సమాజం, కుటుంబం వ్యక్తి వికాసానికి దోహదపడతాయి. ఎంత ఎక్కువ చదివారన్నది కాదు ముఖ్యం.. ఎంత చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నది ముఖ్యం. పాఠశాల విద్య నుంచే మన ప్రణాళికలు ఇందుకు తగ్గట్టుగా రూపొందించాలి. పాఠ్యాంశాలు ఎంత ముఖ్యమో.. పాఠ్యేతర అంశాలు అంతే ముఖ్యం.

అందులో ముఖ్యంగా చూపించవలసిన అంశాలు:

ఆటలు, వ్యాయామం. నైపుణ్యాలకు సంబందించినవి చిత్రలేఖనం, చేతిపనులు, నాటకాలు, పద్యపఠనం, అభినయం, గైడ్స్, ఎన్‌సీసీ మొదలగునవి. ఇవన్నింటిని కూడా వారి వయస్సు చదివే తరగతికి తగ్గట్టుగా అంచల వారిగా ప్రవేశ పెట్టాలి. తరగతిలో ఎంత సేపు ఉండి నేర్చుకున్నా దాని కన్నా పర్యావరణం ద్వారా సరైన అవగాహన కలుగుతుంది.

నేటి సమాజంలో లోపిస్తున్న అంశాలు.

ఉదా..!
ముఖ్యంగా సమయపాలన, పరిసరాల పరిశుభ్రత, ఓర్పు, సహనం, ఔదార్యం, తనవంతు వచ్చేవరకు వేచి ఉండటం వీటన్నింటినీ పాఠశాల నుంచే నేర్చుకోవాలి. ఒక్క పాఠశాలే కాదు తల్లితండ్రులు, సమాజం ఇవన్నీ బాధ్యత వహిస్తే ఒక చక్కటి ‘‘వ్యక్తి’’ మనముందు వికసించగలడు.

Dr Jammalamadaka Nagalaxmi, Hyderabad(98484 80007)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*