
విజయవాడ: స్వామి వివేకానంద ఆదర్శాలను యువతకు అందించేందుకు విజయవాడ రామకృష్ణ మిషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా రామకృష్ణ పరమహంస, శారదా మాత, వివేకనందుల బోధనలు అందేలా చూస్తోంది. కథలు, నాటకాలు, ప్రసంగాల ద్వారా యువతకు దిశానిర్దేశం చేస్తోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయవాడ రామకృష్ణ మిషన్ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటోంది. తమ ఛానల్ ద్వారా విద్యార్థులకు, పెద్దలకు ఉపయుక్తమైన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తోంది.
వివేకవాణిని బలంగా వినిపించేందుకు యూట్యూబ్ ఛానల్ చక్కని మార్గంగా తాము భావిస్తున్నట్టు విజయవాడ రామకృష్ణ మిషన్ నిర్వాహకులు తెలిపారు. రామకృష్ణ పరమహంస, శారదా మాత, వివేకనందుల బోధనలతో స్ఫూర్తి పొందాలనుకునేవారు తమ యూ ట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచించారు.
Be the first to comment