నిశ్శబ్దం రివ్యూ

నటీనటులు: అనుష్క, మాధవన్, షాలిని పాండే, అంజలి
సంగీతం: గోపీసుందర్-గిరీష్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల: 2020 అక్టోబర్ 2, అమెజాన్ ప్రైమ్
రేటింగ్: 3.25

అందాల తార అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై నిర్మించారు. వాస్తవానికి సినిమా హాళ్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్-19 కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయింది.

స్టోరీ :

సాక్షి (అనుష్క) తండ్రి స్థాపించిన అనాథ శరణాలయంలో పెరిగిన సోనాలి (షాలిని పాండే) సాక్షికి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇంతలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) ఎంటరౌతాడు. సాక్షి ఆంటొనీతో కలిసి ఉండటం సోనాలి తట్టుకోలేకపోతుంది. ఇంతలోనే ఆమె అదృశ్యమౌతుంది. కట్ చేస్తే ఆంటోని దారుణ హత్యకు గురౌతాడు. సొనాలి ఎందుకు అదృశ్యమైందనే విషయంతో పాటు అసలు ఆంటోనిని హత్య చేసిందెవరనేది పరిశోధించడానికి మహా ( అంజలి ) వస్తుంది. ఈ కేసును చేధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతుంది. సాక్షి నోరు విప్పి చెప్పలేని మూగ యువతి కావడమే అసలు కారణం. దీంతో ఈ కేసుని ఎలా చేధిస్తారు, హంతకులు ఎవరు? ఇదంతా జరగడానికి కారకులు ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

ప్రత్యేకతలు :

హేమంత్ మధుకర్ దర్శకత్వం
స్క్రీన్ ప్లే
సస్పెన్స్ సబ్జెక్ట్
అనుష్క యాక్టింగ్

నటన:

మూగ యువతిగా అనుష్క నటన సినిమాకే హైలైట్. మాధవన్‌తో అనుష్క కెమిస్ట్రీ పండింది. షాలిని పాండే రోల్ అదిరింది. నటనతో మార్కులు కొట్టేసింది. అంజలి, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ నటన బాగుంది.

టెక్నికల్ టీమ్:

దృశ్యాల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. అమెరికాలో మంచి లొకేషన్లలో షూటింగ్ చేశారు. మ్యూజిక్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. డైరక్టర్ హేమంత్ మధుకర్ మంచి సస్పెన్స్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. స్క్రీన్ ప్లే అదిరింది. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూడటంలో దర్శకుడు విజయం సాధించారు.ఓటీటీలో కాకుండా థియేటర్‌లో అయితే.. ఈ చిత్రం ఇంకా బాగా ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేది. ఈ విషయమే ఈ చిత్రానికి మైనస్‌గా చెప్పుకోవచ్చు.

మొత్తంగా:

విభిన్న కథా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.