ఎందుku? ఏమిti? ఎలాga?… (ఆనందం)

నన్ను ఒకసారి ఎవరో అడిగారు మీకు ఇప్పటివరకు బాగా గుర్తుండిపోయిన happiest మూమెంట్ ఏంటి అని!
నాకు సమాధానం చెప్పడం చాలా కష్టమైంది.
అదే ప్రశ్న ఇప్పుడు నేనూ మిమ్మల్ని అడుగుతున్నాను
మీకు ఇప్పటివరకు most happiest మోమెంట్ ఏంటి అని అడిగాను అనుకోండి.
ఠక్కుమని సమాధానం చెప్తారా లేదా ఆలోచనలో పడతారా? 
Definiteగా ఆలోచనలోనే పడతారు. 
ఎన్ని అని గుర్తు చేసుకోగలరు?
పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎన్నో ఉంటాయి. అన్నింట్లో నుంచి ఒకటి select చేసుకోవాలంటే ఎవరికైనా కష్టమే.
ఒక్కటే చెప్తే, చెప్పనివి, చెప్పలేనివాటికి, చెప్పకూడదు అనుకున్నవాటికి విలువ తగ్గించి అన్యాయం చేసినట్టే …
అదే కోపమో, విచారమో, భయం గురించో అయితే ఎక్కువగా ఆలోచించకుండా, వెంటనే చెప్పేస్తారు.
నా ప్రకారం కోపం, బాధ, భయం, విచారం, చిరాకు, అసహ్యం,  అసహనం ఇలాంటి emotions కి range (పరిధి) ఉంటుంది. ధరలు, ఉష్ణోగ్రతల్లాగా..
ఒక్కోసారి ధరలు చూడండి… (rs. 100 – 200 మధ్యలో అని ఉంటాయి  )
అలాగే ఉష్ణోగ్రతలు ( 25 C – 30 C) కూడా.
అంతే గాని కరెక్ట్ గా ఇంతే అని ఎవరూ “ముందే” చెప్పరు.
అంటే కొంచం కావచ్చు , ఎక్కువ కావచ్చు , ఈ రెండింటికి మధ్యలో కూడా ఉండొచ్చు!
కానీ “ఆనందం” లేదా “సంతోషం” అనే +ve  emotionకి మాత్రం అలా range చెప్పగలమా? 
అదేం విచిత్రమో…మిగతా emotions అన్నీ జిడ్డులా పట్టి రోజుల తరబడి పీడిస్తాయి కానీ,
ఏ కొంచం తేడా జరిగినా,
సంతోషం మాత్రం సగం సేపట్లో 
ఆనందం అయితే పూర్తిగానూ ఆవిరైపోతాయ్…
Happiness, Joy అనే emotion గురించి ఈ వారం ఎందుku? ఏమిti? ఎలాga?

ఎందుku..
అది సరే…
అసలు ఎందుకు సంతోషం(happy)గా ఉండాలి / ఆనంద(joy) స్థితి ఉండాలి?
ఉండడం ఎందుకంత ముఖ్యం? 
తపన?
Simple.. 
-అలా ఉండడం ప్రతి జీవి ప్రాధమిక హక్కు కనుక.
-అలా ఉండకపొతే మిగతా emotions చేసే అల్లరి, చేష్టలు, చర్యలు తట్టుకోవడం కష్టం కనుక.
-క్రియేటివిటీ, productivity పెరుగుతాయి తద్వారా తొందరగా లక్ష్యం చేరుకోగలం కనుక.
-ఆ సంతృప్తితో భవిష్యత్ మీద ఆశ కలిగి బ్రతకడానికి మరింత fuel అందిస్తుంది కనుక.
-సంతోషం అనేదాన్ని ఒకటి కెమికల్ structure లా చూడగలిగితే,  దాని ప్రాముఖ్యత ఇంకా బాగా అర్ధం అవొచ్చు కనుక.

ఏమిti?
సంతోషం (happy) కి ఆనందం (joy) కి తేడా ఏంటి?
సంతోషం :
జీవితంలో, జీవనం మన అవసరాలని
నెరవేర్చడం.
సంతృప్తి, ఇష్టంతో కూడిన భావన.
తల్లిదండ్రులు,  అక్కాచెల్లెళ్లు,  అన్నదమ్ములు, మన అనుకున్న వాళ్ళ ద్వారా వచ్చేది, లేదా చిన్నప్పటి ఫ్రెండ్స్ని, పాఠం చెప్పిన గురువులుని కలిస్తే కలిగే సంతోషం… లేదా పెంపుడు జంతువులని  చూసినప్పుడు వచ్చేది సంతోషం.
సంతోషం ఎప్పుడూ barter systemతోనే బాగా  పని చేస్తుంది.
ఇచ్చిపుచ్చుకోవడం అనమాట!
ఎవరితో అయినా సరే!
తరతమ బేధం లేదు !
అదొక by-product.
ఇదే వాస్తవం!

ఆనందం:
Basic Nature of anyone.
సహజ స్థితి.
మనసు యొక్క దృక్పథం, ఒక క్వాలిటీ, ఒక బలమైన భావన, లోపలి నుండి సహజంగా వచ్చేది.
ఏదైనా అచీవ్ చేసినప్పుడు కలిగేది.
సమతుల్యత కలిగించేది.
స్థిరమైనది.
ఎవరికి వాళ్ళు వాళ్లకి ఏది ఆనందం కలిగిస్తుందో అది తెల్సుకుని క్రమం తప్పకుండా “కుదిరించుకుని” పాటించడం.

ఎలాga?

ఎలా సాధ్యం?
అడ్డదారులు ఏమీ లేవుగా!
నచ్చినా, నచ్చకపోయినా కష్ట పడవలసిందే.
యోగా, ధ్యానం, ప్రాణాయామం, క్రమం తప్పకుండా మన్ని మనం సవాల్ చేసుకొని లక్ష్యాలు సాధించడం, exercise, accupuncture,  relationships maintain చేయడం, ఫీలింగ్స్ రాయడం, బొమ్మలో, గీతలో గీయడం  ఇవన్నీ మీకు చిన్నప్పటినుండే తెలిసినవి. తప్పకుండా చేయాల్సిందే !
ఇవికాకుండా నేను గ్రహించినవి, కాలక్రమంలో subject పరంగానూ, అనుభవంతోనూ  తెలుసుకున్నవి ఏంటంటే…
1. ఎప్పుడూ సంతోషాన్ని కోరుకోవడం… సంతోషాన్ని తప్పకుండా తగ్గించేస్తుంది. అది అసాధ్యం కూడా. ఆనంద స్థితిలో పుట్టుండచ్చు, కానీ నిత్యం బ్రతకాలి అనుకోడం  అత్యాశ.
2. మన అనేసుకుంటున్న ఒకే కుటుంబంలోనే, ఒక్కోరోజు, ఒక్కక్కరు ఒక్కో emotion తో ఉంటారు. నాకు తెలిసి అందరి emotions కలిసేవి నెల్లో మహా అయితే 6 సార్లు. అంటే  సగటున ఒక్కో emotion  శాతం 25%. ఇది balance చేసుకోగలిగితే చాలు.
Expectations ఆటోమేటిగ్గా తగ్గుతాయి.
3. మనకి మనం వ్యక్తి గా 100% అనుకుంటే అందులో ఎవరికీ ఎంత శాతమో ఆ అవసరం గుర్తించి,
అంతే ఇచ్చి ఊరుకోవడం.
ఉదాహరణకి 100మందితో మీ బంధం ఉంటే, మీకు మీరు ఇచ్చుకునే ప్రాముఖ్యత 20 శాతం అనుకుంటే 
మిగతా 80లోనే ప్రపంచం వస్తుంది. ఎవరికీ ఎంత అని ప్రశ్నించుకోవడం ఎంత ముఖ్యమో, కలగాపులగం చేసుకోకుండా,  ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోడం కత్తి మీద సామే.
Balance with Ratio !
లేకపోతే మెదడులో అన్నీ కెమికల్ అసమతుల్యతలే.
ఈ exercise, slowga మనలో ఉండే
ద్వంద్వతాన్ని (duality),  వైరుధ్యాన్ని (dichotomy), పక్షపాతాన్ని (partiality), అసమతుల్యత (imbalance) తగ్గిస్తుంది.
Automaticga అందరితో హ్యాపీగా ఉండగలిగే chance ఉంది. అది ఆనందానికి దారి చూపిస్తుంది.
3. 9-11 inches లో gap / conflict(సంఘర్షణ) సాధ్యమైనంత తగ్గించుకోగలగడం. సంఘర్షణ గందరగోళానికి మొదటి జారుడు మెట్టు. mind to heart కొలత  9-11 inches అనుకుంటే, mindలో ఒకటి, మనసులో ఒకటి, నోట్లోంచి వచ్చేది ఒకటి కానప్పుడు, పొట్టలో
సంతోషమో, ఆనందమో కలగడం సాధ్యమేనా?
ఏమో మరి, నాకైతే అనుమానమే.
ఆలోచించండి.
ప్రయత్న పూర్వకంగా సంతోషాన్ని సగం సాధించగలిగినా, ఆనందం అదే వెతుక్కుంటూ రావచ్చు.

ఏవమ్మా అసలు ఇదంతా ఎలా సాధ్యం, bookish కబుర్లు కాకపోతేనూ, సమస్య నీది కాపోతే సరి  ఎన్నైనా చెపచ్చు అని నా మీద కోపమూ రావచ్చు.

అందుకే కోపంతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. 🙂

స్రవంతి చాగంటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*