
న్యూజెర్సీ: అమెరికా న్యూ జెర్సీ రాష్ట్రంలో సివిఆర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజీనీర్గా, ఫార్మా కంపెనీలకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్న విలాస్ జంబుల 2017లో Telugu NRI Radio స్థాపించారు. 80కి పైగా దేశాల్లో Telugu NRI Radio కార్యక్రమాలు అందిస్తోంది. సుమారు 90 మంది రేడియో జాకీలు Telugu NRI Radioలో పనిచేస్తున్నారు. ఎంతమందికైనా రేడియో జాకీలుగా అవకాశమిస్తామని చెబుతోన్న విలాస్ జంబుల ఈక్షణంతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
అమెరికాలో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటోన్న విలాస్ జంబుల తెలుగువారికి, భారతీయులకు ఏ కష్టమొచ్చినా తీర్చేందుకు ముందుంటారు.
అంతేకాదు విలాస్ జంబులకు తాను పుట్టిన తెలంగాణపై అమితమైన ప్రేమ.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోని మంచాలకు చెందిన జంబుల రామచంద్రా రెడ్డి , అమ్మాయమ్మ దంపతుల రెండో సంతానం విలాస్‌రెడ్డి. మధ్యతరగతి కుటుంబం. బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహకరించేవారు. ఎన్ని కష్టాలుపడ్డా చదువులో మాత్రం వెనుకంజ వేయలేదు. మంచాల ఉన్నతపాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు విలాస్‌రెడ్డి. అప్పట్లో ఎస్సెస్సీలో 459 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని క్విన్ టైల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
దశాబ్దం క్రితమే విలాస్‌రెడ్డి స్థానికంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వగ్రామమైన మంచాల పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేవారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆయన క్విజ్, వ్యాస రచన పోటీలను నిర్వహించేవారు. గెలుపాందిన విద్యార్థులకు ప్రోత్సాహకాలతోపాటు నగదు కూడా అందజేసేవారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా తన సేవా కార్యక్రమాలను ఏనాడూ నిలిపివేయలేదు. స్నేహితుల సహకారంతో నేటికీ తెలంగాణలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం మంచాల మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా మెమోంటాలతో పాటు మొదటి, ద్వితీయ, స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 1000, 500 నగదు అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలను, వృద్ధులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వారి మౌలిక వసతుల కల్పన కోసం ఆయన వేలాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 15న అన్ని పాఠశాలకు చెందిన ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు.
సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్న విలాస్ 10 శాతం విద్యారంగం అభివృద్ధికి, 20 శాతం ట్రస్టులకు, వృద్దులకు, అనాథలకు వెచ్చిస్తున్నారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడంలో తనకెంతో సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఎంతగా ఎదిగినా పుట్టిన నేల తల్లి రుణం తీర్చుకోవడం ప్రధానమంటూ తెలుగువారితో పాటు భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
విలాస్‌రెడ్డికి భార్య చిత్రలేఖ, కుమార్తె రిషిత ఉన్నారు.
విలాస్ జంబుల మరింత వృద్ధిలోకి రావాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ క్షణం టీం ఆకాంక్షిస్తోంది.
VilasReddy Jambula
Ph: +1-408-386-9825(M)
Email: vilasreddy@gmail.com
Tweets by vilas0503
https://www.facebook.com/vilasreddy.jambula
Be the first to comment