తెలుగు NRI రేడియో సక్సెస్‌ఫుల్ RJ అశ్విని అనుభవాలు

న్యూజెర్సీ: ప్రవాసాంధ్రుల కోసం విలాస్ జంబుల, మామా మహేశ్, వెంకట్ ప్రారంభించిన తెలుగు NRI రేడియో అమెరికాతో పాటు 80 దేశాల్లో కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. 90 మందికి పైగా రేడియో జాకీలు తెలుగు NRI రేడియోకు సేవలందిస్తున్నారు. 24 గంటలూ ఆసక్తికరమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ లక్షలాది మంది శ్రోతలను అలరిస్తున్నారు. వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు NRI రేడియోలోని సక్సెస్‌ఫుల్ రేడియో జాకీల్లో అశ్విని ఒకరు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే.

’గుర్తుకొస్తున్నాయి‘. ఈ పేరులోనే ఎన్నెన్నో సంగతులు, విశేషాలు, అనుభవాలు, జ్ఞాపకాలు.. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇలాంటివి ఆలోచిస్తూ నాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇచ్చిన ఒక అవకాశం ద్వారా మా పెద్ద అమ్మమ్మ గారైన సూర్యకాంతం విశేషాలతో ఈ కార్యక్రమం (షో) మొదలు పెట్టాను. అలాగే వారితోపాటు నటించిన వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సినీ రంగంలో సుపరిచితులైన ఎందరో దిగ్గజాలను ఈ కార్యక్రమం ద్వారా అందరితో మాట్లాడించాను. ఆ తరం వారిని తిరిగి ఈ తరం వారికి, ప్రవాసాంధ్రులుకు పరిచయం చేస్తూ వారి ప్రయాణాలు, ఇంటి నుంచి మొదలుకొని వారి తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన గ్రామాలు, బాల్యం, మొట్టమొదటి నాటక ప్రవేశాలు, సినీ ప్రస్థానాలు, మా అమ్మమ్మగారితో పరిచయంతో మొదలైన ప్రయాణం.. ఇలా ఇప్పటిదాకా.. చేస్తూ అభిమానులు, శ్రోతల ఆదరాభిమానాలు సంపాదించుకున్నాను. ఇలాగే శ్రోతలు నన్ను, నా కార్యక్రమాన్ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తుల ఫోన్ నెంబర్స్ సేకరించటం, వారితో, వారి మేనేజర్స్‌తో మాట్లాడటం, వారికి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం చెప్పటం, ఒక తేదీ తీసుకోవటం, దానికి ప్లయెర్ వేయించుకుని, స్క్రిప్ట్ రాసుకుని డౌట్స్ క్లియర్ చేసుకుని, నమ్మకాన్ని పెంపొందించుకుని ఇంటర్వ్యూకు సిద్ధమౌతాం. సరిగ్గా ఇంటర్వ్యూ చేసేముందు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆత్మీయంగా వారిని రిసీవ్ చేసుకుని, కార్యక్రమానికి కాల్ చేసే శ్రోతలను ఆప్యాయతగా పలకరిస్తూ రిసీవ్ చేసుకోవాలి. నా కార్యక్రమానికి వచ్చిన గెస్ట్‌తో తీపి జ్ఞాపకాలు ఇచ్చి పుచ్చుకుంటూ, తర్వాత యూ ట్యూబ్‌లో వారి సంభాషణ పదిలపరచాలి. ఇలా ఇన్ని దశల్లో పనిచేస్తే రూపొందే నా కార్యక్రమానికి సంబంధించి అనేక మధుర జ్ఞాపకాలు ’గుర్తుకొస్తున్నాయి‘. కాల్ చేసిన ప్రతి ఒక్కరి కాల్‌ను తీసుకుని సహకరించిన సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా మా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

రేడియో జాకీ అశ్వినిగా ప్రపంచానికి పరిచయం చేసి, ఆత్మీయులతో పరిచయం కలిగించి, ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, అందరికి వారి గురించి తెలియజేసే అవకాశం కల్పించిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్ మెంట్ విలాస్ జంబుల, మామ మహేష్ మరియు వెంకట్ గార్లకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

– ఇట్లు మీ అశ్విని, తెలుగు ఎన్ ఆర్ ఐ రేడియో వ్యాఖ్యాత

Visit us on Web @ http://telugunriradio.com/
Like us on FB @ https://www.facebook.com/TeluguNriRadio/
Follow us on Twitter @ https://twitter.com/TeluguNriRadio/

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*