
హైదరాబాద్: దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్ధి, సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం బీ ఫాం అందించారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలవాలని కేసీఆర్ సూచించారు.
సీఎంను కలిసిన వారిలో దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ హరీశ్ రావు, ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులున్నారు.
దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సోలిపేట సుజాత ఈ రోజు మంత్రి శ్రీ @trsharish, ఎంపీ శ్రీ @KPRTRS, ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గార్లతో సీఎం శ్రీ కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. 1/4 pic.twitter.com/fOTd62u204
— TRS Party (@trspartyonline) October 7, 2020
మంత్రి సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో సుజాత బరిలోకి దిగారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని లింగన్న లాగే దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటానని సోలిపేట సుజాత చెప్పారు.
సీఎం కేసీఆర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను.. మీ లింగన్న లాగే మీకు (దుబ్బాక ప్రజలకు) నేను అందుబాటులో ఉంటాను.
– దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి సోలిపేట సుజాత. @trsharish @KPRTRS #VoteForCAR pic.twitter.com/2sm6kAvwmr— TRS Party (@trspartyonline) October 7, 2020
మరోవైపు దుబ్బాకలో బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో మురిపిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పధకం.
ఏండ్లు గడుస్తున్న అతీగతీ లేదు. pic.twitter.com/PNkFW17reW— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) October 7, 2020
కాంగ్రెస్ తరపున శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు.
Be the first to comment