క్రైసిస్ మేనేజ్‌మెంట్‌పై రామకృష్ణ మఠంలో కొత్త కోర్సు

హైదరాబాద్: ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ VIHE 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ యువతీ, యువకులకు, ఉద్యోగుల కోసం ఓ మంచి కోర్సును ముందుకు తెచ్చింది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌పై కొత్త కోర్సును అందిస్తున్నట్టు VIHE డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమయ్యే క్లాసులు అక్టోబర్ 16 వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. తమ వెబ్ సైట్‌లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని VIHE ప్రతినిధులు తెలిపారు.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే ఆన్‌లైన్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*