
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డిని నియమించారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సీఎస్‌గా ఉన్నారు. ఇప్పటివరకూ అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా కొనసాగారు. ఆయన్ను కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. టీటీడీ చైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతారు.
తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు భారతీయులే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దీంతో ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. ప్రపంచంలో ఎక్కువ ఆదాయం తిరుమల దేవస్థానానిదే. టీటీడీ ఆధ్వర్యంలో దేశం నలుమూలలా ఆలయాలు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక దేవాలయాల సంరక్షణ టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
Be the first to comment