20 ఏళ్లుగా ఓటమి ఎరుగని నాయకుడు మోదీ.. సరికొత్త రికార్డ్..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మూడుసార్లు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014, 2019లో దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. 2001 నుంచి ఓటమెరుగని నాయకుడుగా దూసుకుపోతున్నారు. సంస్కరణలతో పెట్టుబడులు ఆకర్షించడమే సూత్రంగా ఆయన పనిచేస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడమే ఏకైక మంత్రంగా ఆయన కార్యాచరణ ఉంది.

గుజరాత్‌లో మొదలైన ఆయన అభివృద్ధి రాజకీయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సత్పలితాలిస్తోంది. ఆయన హయాంలో స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, ఆయుష్మాన్ భారత్, ఈబీసీ రిజర్వేషన్లు, బేటీ బచావో-బేటీ పడావో, పౌరసత్వ సవరణ చట్టం, రైతు సంస్కరణల చట్టాలు తదితర చట్టాలు వచ్చాయి.

అంతేకాదు దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య రామజన్మభూమి వివాదం పరిష్కారమైంది. అవినీతి మచ్చలేని పాలనతో ఆయన అందరి మన్ననలూ పొందుతున్నారు.

మరెన్నో సంస్కరణలు చేపట్టబోతున్నారు. కోవిడ్ వేళ ప్రపంచదేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. అత్యల్ప మరణాల రేటుతో పాటు కోవిడ్ బారిన పడిన ప్రజలు తిరిగి పెద్ద ఎత్తున కోలుకుంటున్నారు. ఆరు నెలల క్రితం లాక్ డౌన్ ప్రకటించే నాటికి దేశంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్ ఉండేది. నేడు దేశంలో 2 వేలకు పైగా ల్యాబులు ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్లు, మాస్కులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అనేక దేశాలకు టాబ్లెట్లను, పీపీఈ కిట్లను, మాస్కులను సప్లై చేస్తున్నారు. వెంటీలేటర్ల తయారీ పెద్ద ఎత్తున చేపట్టారు.

వ్యాక్సిన్ వస్తే భారతీయులతో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులోకి తెచ్చేలా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అందిస్తామని ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటనపై స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. ప్రపంచ దేశాలన్నీ మోదీ పాలనా పద్ధతులను మెచ్చుకుంటున్నాయి.

ముఖ్యంగా పాకిస్థాన్‌కు, చైనాకు సరైన గుణపాఠాలు నేర్పించడంలో మోదీ ముందున్నారు. ఎల్‌ఓసీతో పాటు ఎల్‌ఏసీ వద్ద కూడా భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. నిరంతర నిఘా పెంచారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన యుద్ధ విమానాలను చౌక ధరలకు, భారత్ అవసరాలకు తగ్గల్లుగా తయాకారు చేసి తీసుకొచ్చారు. విదేశాల నుంచి అత్యంత అధునాతన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. భారత్‌లో కూడా బ్రహ్మోస్ లాంటి అత్యంత అధునాతన క్షిపణులను, ఇతర ఆయుధ సామాగ్రిని తయారు చేస్తూ ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు.

రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్ విశ్వగురువు కావడం ఖాయమని స్వామి వివేకానంద ముందే ఊహించి చెప్పిన సత్యం వాస్తవ రూపం దాల్చబోతోందని పరిశీలకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*