కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్టోబరు 8వ తేదీన “కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్” పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ‘మాస్కు ధరించండి, భౌతిక దూరాన్ని అనుసరించండి, చేతి పరిశుభ్రతను పాటించండి’ వంటి ముఖ్య సందేశాలతో తక్కువ ఖర్చుతో, ప్రచారాన్ని ఉధృతంగా చేయడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.

అందరూ కోవిడ్-19 ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఈ క్రింది ముఖ్యాంశాలతో, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలచే సంఘటిత కార్యాచరణ ప్రణాళిక అమలు చేయబడుతుంది:

* కేసుల భారం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో, ఆప్రాంతాలపై నిర్దిష్ట లక్ష్యంతో ప్రచారం జరుగుతుంది.

* ప్రతి పౌరునికీ చేరుకునే విధంగా సరళమైన, సులభంగా అర్థమయ్యే సందేశాలు

* అన్ని మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం

* బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు మరియు పోస్టర్లు; ఫ్రంట్ ‌లైన్ కార్మికులు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకోవడం

* ప్రభుత్వ ప్రాంగణంలో హోర్డింగులు / గోడలపై పెయింటింగులు / ఎలక్ట్రానిక్ ప్రదర్శన బోర్డులు

* ఈ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరుకోడానికి వీలుగా స్థానిక మరియు జాతీయ స్థాయి ప్రముఖుల సేవలను వినియోగించుకోవడం

* సాధారణ అవగాహన కల్పించడం కోసం మొబైల్ వ్యాన్లను ఉపయోగించడం

* ఆడియో సందేశాలు; అవగాహనపై కరపత్రాలు / బ్రోచర్లు

* కోవిడ్ సందేశాలను ప్రసారం చేయడానికి స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు కోరడం

* సమర్థవంతమైన ఔట్ రీచ్ మరియు ప్రభావం కోసం వివిధ మీడియా వేదికల మధ్య సమన్వయంతో ప్రచారం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*