
హైదరాబాద్: తెలుగునాట అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ఆదరణ ఉంది. తిరుమలేశుడికి పద సంకీర్తనార్చన చేసిన వాగ్గేయకారుడు ఆయన. తేటతేట తెలుగులో… అలతి అలతి పదాలతో.. చక్కని భావంతో అజరామరమైన సాహిత్యాన్ని అందించారు. తెలుగు సాహిత్యంలో పద కవితా పితామహుడుగా నిలిచారు. అన్నమాచార్య కీర్తనలపై ఆసక్తి కలవారికి సంగీత తరగతులను నిర్వహించనున్నట్టు ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ VIHE డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. ఈ ఆన్ లైన్ తరగతులు అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 12 వరకు రెండు నెలల పాటు ప్రతి శని, ఆదివారాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు క్లాసులు ఉంటాయి. పదేళ్ల పైన వారు మాత్రమే అర్హులు.
ఆర్కే మఠ్లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
Be the first to comment