అర్ధనారీశ్వరమూర్తిని పూజ చేస్తే సుఖభోగాలతో పిల్లాపాపలతో ఆనందంగా ఉంటారు

ప్రస్తుత సమాజంలో స్త్రీలకు సమాన హక్కు మరియు స్త్రీలు పురుషులు సమానం అని అంటున్నారు. కాని మన సనాతన ధర్మంలో ఏనాడో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరే అని చెప్పింది. అందుకున్న అతి పెద్ద ఉదాహరణ అర్ధనారీశ్వర తత్వం, శివుడు తన సతి అయిన పార్వతీ దేవిని తన శరీరంలో సమాన భాగం ఇచ్చారని మన శాస్త్రం తెలుపుతుంది. చిత్ర శాస్త్రంలో పార్వతీ పరమేశ్వరులను చాలా అందముగా చూపించారు. ఇందులో పార్వతీ దేవి నీల మేఘ వర్ణం ఎందుకంటే ఈమె సాక్షాత్తు శ్రీమహావిష్ణువు సోదరి. అలాగే శివుడు అపుడే ఉదయించిన సూర్యుని వలే ఎరుపు రంగు ఛాయతో ఉంటాడు. ఈ విధముగా చిత్రించిన వర్ణ చిత్రం. రూపధ్యాన రత్నవళిలోని శ్లోకం అధారంగా చిత్రించినది ఈ చిత్రం.

శ్లోకం…..

చతుర్భుజం త్రినేత్రం చ శివాంశం దక్షపాశ్చ్వకే వామార్ధం వామభాగే తు సీమంతతిలకాలకవ్ నేత్రార్ధం తు లలాటే తు సంయుక్తం దక్షిణాంశకే దక్షిణే కుండలం కర్ణే దధం వామే తు పత్రకం కట్యాం వా కలితం వామే ఒభయటంకా చ దక్షిణే వరదోత్పలకే వామే కేయూర కటకాన్వితవ్ ఉ మాంగే తు స్తనం కుర్యాత్ స్వాహాకార యుతం తువా శ్రోణ్యర్ధం దక్షిణే శంభో ర్వ్యాఘ్రచర్మకృతాంబరమ్ | ఉమార్ధం కటిసూత్రం తు చిత్రవస్త్ర పరిచ్ఛేదము నూపురాలంకృతం వామే సవ్యపాదం తుకుంచితవ్స్వయం ప్రవాలవర్ల: స్యాత్ సుకృష్ణం వామభాగ కమ్ అర్ధనారీశ్వరం ప్రోక్తం (రూపం సర్వ శుభప్రదమ్) దేవీభాగః శ్యామవర్ణ ఈశ్వరో రక్తవర్ణం:…

ఈ విధమైన రూపంతో ఉన్న అర్ధనారీశ్వర మూర్తి ని పూజ చేయటం వల్ల వారి దాంపత్య జీవితం సుఖభోగాలతో పిల్లాపాపలతో ఆనందంగా ఉంటారు.

మన సనాతన ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి. అందులో పూజ విధానం ఒకటి. మనకు దేవాలయానికి వెళ్ళి పుజ చేయటం మరియు ఇంట్లోనే ఒక చిత్రపటానికి పూజ చేయడం. కానీ మన శాస్త్రంలో అనేక దేవీదేవతలున్నారు. వారికి పూజ చేయు విధానం ఉన్నది అదేవిధంగా ఆ దేవత చిత్రం మరియు శిల్పం ఎలా ఉండాలనేది ఉన్నది. కానీ నేటి సమాజంలో చాలా వరకూ చాలా మంది శాస్త్రంలో చెప్పని విధంగా తగిన కొలతలు లేనివి రంగురంగుల చిత్రపటాలను ఉంచుకుని ఉన్నారు. చాలా మందికి ఏవిధమైన చిత్రపటములను ఉంచుకోవాలో తెలియదు. వారికి తెలియజేయడం నా భాద్యత. ఎందుకంటే నేను ఈ విధమైన శాస్త్రం చదువుకున్నా. కాబట్టి నావంతుగా నేను చిత్ర శాస్త్రంలో కొలతల ప్రకారం మరియు వర్ణం ప్రకారం చిత్రాలను చిత్రిస్తూన్నా….
నేను సాంప్రదాయ చిత్రలేఖనంలో డిప్లమా చేసాను. మరియు చిత్రలేఖనంలో డిగ్రీ చేశాను. అనేక ఆలయాలలో పరిశోధన చేసి మరియు సులభ రీతిలో సాంప్రదాయ చిత్రలేఖనాన్ని గీస్తూ అనేకమందికి అవగాహన కలిపిస్తున్నాను. అలాగే అనేక మందికి ఈవిధమైన చిత్రలేఖనాన్ని ఉచితంగా నేర్పిస్తున్నాను.

-వేలురు మోహన్ లోకేష్(V.mohan Lokesh)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*