జగనన్న విద్యా కానుకతో డ్రాపౌట్లు నిజంగానే తగ్గుతాయా?

విజయవాడ: జగనన్న విద్యా కానుక పథకాన్ని ముఖ్యమంత్రి వైెస్ జగన్‌మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ప్రారంభించారు. పథకంలో భాగంగా 42 లక్షల మందికి పైగా విద్యార్ధులకు బ్యాగ్‌తో పాటు 3 జతల యూనిఫామ్స్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ సందర్భంగా జడ్‌పి స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసెఫ్ జాయ్ మాటలు తనకు గుర్తుకు వస్తున్నాయన్నారు. నెల్సెన్ మండేలా కూడా విద్యతోనే ప్రపంచాన్ని మార్చవచ్చని‌ చెప్పారని జగన్ గుర్తు చేశారు. విద్యా కానుకతో పాటు విద్యా వ్యవస్థలో తాము తెచ్చే సంస్కరణలతో డ్రాపౌట్లు తగ్గుతాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రపంచంతో పోటీ పడి, జయించే శక్తి పేద పిల్లల్లో రావాలని జగన్ అన్నారు. ఇది జరగాలనే ఉద్దేశంతో తాము విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు. చదువే తరగని ఆస్తి అని, ఎవరూ ఎత్తుకుపోలేని ఆస్తి అని జగన్ చెప్పారు. చదువే బ్రతుకులను మార్చే ఆస్తి కాబట్టే తాము ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే భావిస్తారని అయితే అసలు పిల్లలు బడి ఎందుకు మానేస్తున్నారో గత పాలకులు ఎవరూ ఆలోచించ లేదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే 34శాతం నిరక్షరాస్యత ఏపీలో ఉందని చెప్పారు9.

ఇంగ్లీషు మీడియం చదువు పేదలకు అందకుండా పోయిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. తమను విమర్శించే వారు.. గతంలో చదువుకు ఏమి ప్రాధాన్యత ఇచ్చారో ఆలోచించుకోవాలని చెప్పారు.

జగన్ ఇంకా ఏమన్నారంటే!

ప్రభుత్వం పాఠశాలలు ను అభివృద్ధి చేసేందుకే నాడు..నేడు అమలు చేస్తున్నాం

పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాదు.. అందరకీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం

గోరు ముద్ద పేరుతో భోజనం, అందరితో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం చదువులు ప్రారంభించాం

విద్యా కానుక ద్వారా బడికి వెళ్లే పిల్లలకు యూనిఫాం, షూస్, బ్యాగ్, టై, బెల్టు, టెక్స్ట్, వర్కు బుక్స్ ఇస్తున్నాం

పెద్ద వాళ్ల పిల్లులు ఎలా వెళతారో పేదల పిల్లలు కూడా అలాగే పాఠశాలకు వెళతారు

నవంబర్ రెండు నుంచి బడులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది

.ఈలోపే అందరికీ 650కోట్లతో విద్యా కానుక కిట్ లను అందచేస్తున్నాం

కోవిడ్ కారణంగా మూడు రోజుల పాటు ఈ కిట్ ల పంపిణీ చేస్తున్నాం

ఈ మార్పు తో.. జగన్ మామ ప్రభుత్వం లో బాగా‌ చదువుకుంటాం అని పేదలు గొప్ప గా చెప్పాలి

మన రాష్ట్రం లో చదివిన పిల్లల కోసం అనేకమంది వెతుక్కుంటూ వచ్చి అవకాశాలు ఇవ్వాలి

చదువుతోనే పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది

విద్యా రంగంలో నే ఎనిమిది సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నాం

పిల్లలను బడికి , కాలేజీకి పంపాలలనే అమ్మ ఒడి కింద యేటా 15వేలు ఇస్తున్నాం

జనవరి తొమ్మిదిన మళ్లీ రెండో‌ విడత 15వేలు ఎకౌంటు లో‌ వేస్తాం

పిల్లల చదువు పై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం

గర్భిణీ తల్లులు, పసి పిల్లల పౌష్టికాహారం కోసం యేడాదికి 1800 కోట్లు ఖర్చు పెట్టాం

అంగన్ వాడీ కేంద్రాలను ఉచిత శిక్షణ కేంద్రాలుగా మారుస్తాం

ఆరేళ్ల వయసులో పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది

ఆ సమయం నుంచే వారికి విద్యాబుద్ధులు ప్రారంభించాలి

బడికి వచ్చే ప్రతి పిల్లవాడికి గోరు ముద్ద కింద రోజుకో‌ రకమైన వంటకంతో భోజనం పెడుతున్నాం

ఇంటర్ అయిపోయాక కూడా ఇంజినీరింగ్‌, మెడిసిన్ వరకు పిల్లలు చదవాలి

ఇందుకోసం ఒక్క రూపాయి కూడా భారం పడకూడదని విద్యా దీవెన అమలు చేస్తున్నాం

ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చేలా కరికులంలో కూడా మార్పులు తెచ్చాం

హాస్టల్ ఖర్చులు కూడా లేకుండా ఉండాలని ఆ తల్లులకు యేడాది కి పది నుంచి ఇరవై వేలు ఇస్తున్నాం

వసతి దీవెన పధకం కింద తొలి విడత ఇచ్చాం, నవంబర్ లో రెండో విడత ఇస్తాం

పిల్లల ఆరోగ్య సమస్యలు పై కంటి‌వెలుగు పధకం అమలు చేస్తున్నాం

పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి కళ్ల జోళ్లు ఇచ్చాం

అవసరమైన విద్యార్థులు కు కంటి ఆపరేషన్ లు కూడా చేయిస్తున్నాం

మాది మనసున్న ప్రభుత్వం కాబట్టే… పుట్టిన బిడ్డ దగ్గర నుంచి విద్య పూర్తి అయ్యే వరకు మేనమామగా అండగా ఉంటాను

దేశంలోనే ఎక్కడా లేని‌విధంగా చదువుల చరిత్ర ను మార్చాం

పోటీ ప్రపంచంలో గెలిచి నిలిచేలా ఎపి విద్యార్థులు రాణిస్తారు

పెద్ద స్కూళ్లకు పంపలేని‌ వారంతా.. ప్రభుత్వ పాఠశాలలోనే పెద్ద చదువులు చదవాలి

అందరి అండతో ఈ పధకాలను ఇలాగే కొనసాగిస్తాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*