పిల్లల ఎదుగుదల వ్యక్తిత్వ వికాసంలో ప్రథమం: డాక్టర్ జె. నాగలక్ష్మీ ప్రత్యేక కథనం

హైదరాబాద్: వ్యక్తిత్వ వికాసం ఒక్కసారిగా వచ్చేది కాదు. దీనికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. బాల్య, యవ్వన, ప్రాఢ దశలో కాలగతిలో వచ్చేది.

‘‘మాతీ తను దాత, పితీ స్థితి దాత, గురు జ్ఞాన దాత మరియు అతిథి మోక్ష దాత’’.

తల్లి గర్భం నుంచే పిల్లవాడు నేర్చుకోవడం మొదలవుతుంది. అందువల్లే తల్లి చక్కటి ఆహారం తిని ఆనందంగా ఉంటే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలను పెంచటం ఒక చక్కటి నేర్పు అమ్మవడి పిల్లలకు ‘మొదటిబడి’ అనే నినాదం ఉంది. పిల్లవాడి పెరుగుదలను దానికి తగ్గ ప్రవర్తనను గుర్తించటానికి దోహదం అవుతాయి. పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల నిర్దిష్టంగా ఉండాలి. శారీరక లోపాలను కొన్నింటిని సరిచేయించటానికి వీలవుతాయి. కానీ మానసిక ఎదుగుదలకు, ఇల్లు, పాఠశాల సమంగా సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. సరైన సమయంలో వీటిని సవరించకపోతే పిల్లలపై గట్టి ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మన సంఘంలోని సభ్యులు సరిగ్గా ప్రవర్తిస్తే పిల్లలను పెంచే విధానంలో ఎక్కువ తేడాలు లేకుండా విద్యార్థి ఎదగడానికి వీలవుతుంది.

వ్యక్తిత్వ వికాసం:

పిల్లలను ప్రాథమిక స్థాయిలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త వాతావరణంలోనికి… ఇంటి తరువాత బడికి వస్తారు. అందరినీ ఒకే మార్గంలో నడిపించగలరా? అంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. పాఠశాలకు ఒకే దారి ఉన్నా.. వివిధ మార్గాల నుంచి భిన్నమైన ఇళ్ల నుంచి విద్యార్థులు వస్తారు. మానవ జాతిలోనే లేదు సమానత్వం. ఎదుకంటే ప్రతిఒక్కరూ తమ మనుగడకు వైవిధ్యాన్ని కోరుకుంటారు. వైవిధ్యం లేకపోతే ప్రగతి సాధ్యపడదు. అందువల్ల ఎదుగుదలలో తేడాలు ఉంటాయి. మానసిక ఎదుగుదలే కాకుండా మేథస్సు ఎదుగుదలలో కూడా తేడా ఉంటుంది.

ఇక్కడ ఉపాధ్యాయుడి పాత్ర విశిష్టతను సంతరించుకుంటుంది. విద్యార్థుల గ్రాహ్యక శక్తిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల తేడాలను తప్పుగా గుర్తించరాదు. ఎప్పుడైతే ఆ రకమైన ప్రోత్సాహం ఉపాధ్యాయుడి నుంచి గాని, తల్లిదండ్రుల నుంచి గాని వస్తుందో అప్పుడు అభ్యసన సులువుగా ఉంటుంది. ఒకసారి ఈ రకమైన ‘ఆవిర్భావం’ జరుగుతుందో పఠనం, శ్రవణం వీటిపై శ్రద్ధ పెట్టగలుగుతాడు. చెప్పినవి అర్థమైతే ఎలా ఆచరించి ముందుకు సాగాలో తెలుసుకుంటాడు. అందుకే 0-3, 3-8 ఈ సంవత్సరాలు 12 ఏళ్లు వచ్చేవరకు కొంత జాగ్రత్త వహిస్తే ముందుకు సాగటం సులభం.

-Dr Jammalamadaka Nagalaxmi, Hyderabad(98484 80007)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*