భాగవత పురాణాన్ని పఠిస్తుండేవారు కలి ప్రభావానికి గురికారు: శ్రీకృష్ణ భగవానుడు

శ్రీ గురుభ్యోన్నమః శ్రీమద్భాగవత మహా పురాణం

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం। దేవిం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్।।

భగ శబ్దమునకు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యం అని అర్థము కలదు. భాగవతం అనగా భా- భక్తి, గ- జ్ఞానం, వ- వైరాగ్యం, త-తత్వం, మ్- మోక్షం . ” శ్రీ మద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితమ్” శ్రీమద్భాగవతమును శాస్త్రమని, శుక శాస్త్రమని చెప్పబడింది. నారాయణ శాఖ , బ్రహ్మ శాఖ , నారద శాఖ, వ్యాసశాఖ, శుకశాఖ, సూత శాఖ అని ఈ పురాణమునకు పలువిధములైన పేర్లు కలవు.

శ్రీ మద్భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలో ఐదో పురాణంగా పరిగణిస్తారు. భాగవత పురాణం మొదటిగా సారసత్వ కల్పంలో విష్ణువు బ్రహ్మకు చెప్పారు. శ్రీ మద్భాగవత పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులుగా చెప్పబడుతుంది. ఈ పురాణములో 12 స్కంధములు, 335 అధ్యాయములు, 18,000 శ్లోకములు, 5 లక్షల 76 వేల అక్షరములు అని అన్యూనాతిరిక్తముగా మాహాత్మ్యదులచే, వ్యాఖ్యాతలచే నిర్ణయించబడింది.
మొదటి స్కంధము: భగవద్భక్తి, భీష్మ నిర్యాణం, అర్జున విషాదం మొదలగు విషయాలు చెప్పబడినవి.

వేదః పురాణం కావ్యంచ ప్రభుర్మిత్రం ప్రియేవ చ। బోధయంతీతి హిప్రాహుస్త్రవద్భాగవతం పునః।।
వేద, పురాణ, కావ్యములు, ప్రభు, మిత్ర, కాంత సమానములు అని ఆలంకారికులు చెప్పుచున్నారు. శ్రీమద్భాగవతమందు ఈ మూడు మిలిత మై ఉన్నవి.

అష్టాదశ పురాణములకు పురాణ పంచలక్షణములు కలవు అవి సర్గ, ప్రతిసర్గ, వంశం, వంశానుచరితం, మన్వంతరం.
తస్మాదిదం భాగవత పురాణం దశ లక్షణమ్। ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్ ।। అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూతయః ।మన్వంతరేశాను కథా నిరోధా ముక్తి రాశ్రయః।।
శ్రీ మద్ భాగవత పురాణం లో మాత్రం దశ పురాణ లక్షణాలు చెప్పబడినవి అవి సర్గ, విసర్గ, స్థానం, పోషణ, ఊతి, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి ఆశ్రయములు అని పేర్కొనబడినవి.
సర్గ: పంచభూతాల ఆవిర్భావం
విసర్గ: బ్రహ్మ సృష్టి రచన చేయుట
స్థానం: భగవంతుడు కృతకృత్యుడు కావటం
పోషణం: సకల జీవుల రక్షణ
ఊతులు: సకల జీవులలో దాగి ఉన్న కర్మ వాసనలు
మన్వంతరం: 14 మన కులం యొక్క కథలు
ఈషానుకథ: భగవంతుడి వివిధ రూపాల కథలు
విరోధం: ప్రళయకాలంలో జీవాత్మలు వాసనలతో ఉంటూఎలాంటి చేతనాస్థితి లేని అవస్థను గూర్చి చెప్పటం
ముక్తి: జీవుడు భక్తి మార్గము ద్వారా పరమపదాన్ని చేరటం
ఆశ్రయం: ఈ విశ్వానికి ఆధారమైన పరమాత్ముని చేరటం.

భాగవతంలో వర్ణించబడ్డ విషయాలు వేదసారంలో నిమిడీకృతమై ఉంది. భగద్భక్తి మహత్యం. పరిక్షిత్ జననం, నారద మహర్షి పూర్వ జన్మ వృత్తాంతం, భగవంతుని అవతారాలు, వ్యాసుని అసంతృప్తి కారణాలు, నారద మహర్షి వచ్చి చెప్పుట,శ్రీ కృష్ణుని జీవన విధానం, భాగవతులు కథలు ,భగవంతుని లీలలు, తదితర విషయాలు రాయమని చెప్పుట, ముక్తి మార్గం, భాగవత రహస్యం, ధ్రువుని చరిత్ర. కపిల సాంఖ్యయోగం, దక్షయజ్ఞం, దదిచి వృతంతం, ప్రహల్లద చరిత్ర, మనవుల గురించి , సాధు లక్షణాలు, ఉద్దవచరిత్ర, గృహశ్రమ ధర్మాలు, శ్రీ కృష్ణ లీలలు, శ్రీ కృష్ణుని భార్యలు సంతానం , త్రిపురాసుర సంహారం, శిశుపాలవధ, రుద్రగీత, వర్ణాశ్రమ ధర్మాలు, మనవుడు ఎలా జీవించాలి, భగవంతుని సాయుద్యం ఎలా పొందాలి, కలియుగ ప్రభావం, ప్రళయలు, వైవస్వత, మనువంశ ఇక్ష్వాకు వంశ, రాముని చరిత్ర, చంద్రవంశీయుల చరిత్ర, శ్రీ కృష్ణుని నిర్యాణం తదితర విషయాలు వర్ణించబడ్డాయి.

భాగవత మహా పురాణ విశిష్టతను పద్మపురాణంలో ఆరు అధ్యాయములలో వర్ణించబడింది.

శ్లోకం
జన్మాద్యస్య యతోఽన్వయాదితరతశ్చార్థేశ్వభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మ వృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః। తేజోవారిమృదాం యథ వినిమయో యత్ర త్రిసర్గోఽమృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి।।( 1-1-1) భాగవతం

పరమాత్మ ద్వారానే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. ఆ పరమాత్ముడే ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు విరాట్ స్వరూపుడు అయిన పరమాత్ముడు సమస్త విశ్వానికి ఆధారమై ఉన్నాడు అటువంటి విరాట్ స్వరూపాన్ని ఊహించుటకు సాధ్యము కాదు పరమాత్మ ఎవరు అని విచారిస్తే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ పోతే ఏదైతే ఉంటుందో అదే దైవం. ఎంతటి పండితులైన ఎంతటి విద్వాంసులైన ఈ బాహ్యపు మాయను జయించలేక పోతున్నారు. త్రి గుణములతో ఈ విశ్వము సత్యముగా కనిపిస్తుంది కానీ మిథ్యయే. ఏ విధంగా అంటే ఎడారిలో నీరు ఉన్నట్టుగా కనిపిస్తుందో ఆ విధంగా ఈ విశ్వం సత్యమని బ్రమ కలుగుతోంది. ఇటువంటి మాయ చేత ఎవరైతే సకల జీవులకు బ్రమ కలిగేలా చేస్తున్నారో ఆ పరమ సత్య స్వరూపుడగు పరమాత్ముని ధ్యానించెదము.

భాగవత మహిమ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి భాగవత మహిమను ఇలా వివరించి చెప్పాడు . 1. శ్రీమద్భాగవతం నామపురాణం లోక విశ్రుతమ్ | శృణుయా ఛ్ఛద్ధయా యుక్తో మమసంతోష కారణమ్ || 2. నిత్యం భాగవతం యస్తు పురాణం పఠతేనరః | ప్రత్యక్షరం భవత్తస్య కపిలాదానజం ఫలమ్ || 3. శ్లోకార్థం శ్లోక పాదంవా నిత్యం భాగవతోద్భవమ్ | పఠతే శృణుయాద్ మస్తు గోసహస్రఫలం లభేత్ || 4. యః పఠేత్ ప్రయతో నిత్యం శ్లోకం భాగవతం సుతః | అష్టాదశ పురాణానాం ఫలమాప్నోతి మానవః || 5. నిత్యం మమ కథాయత్ర తత్ర తిష్ఠతి వైష్ణవాః | కలిబాహ్యా నరాస్తే వై యేర్చయంతి సదామమ ||6.యచ్ఛక్తి వైష్ణవే భక్త్యా శాస్త్రం భాగవతం హియే | కల్పకోటి సహస్రాణి మమలోకే వసంతితే ||

శ్రీమద్భాగవతపురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందిన ఈ పురాణాన్ని నిత్యం శ్రద్ధతో శ్రవణం చేస్తే నేనెంతో సంతోషిస్తాను. ఎవరైతే ప్రతిరోజూ భాగవత పురాణాన్ని పఠిస్తాడో అందులో అతడు ఉచ్చరించిన ఒక్కో అక్షరానికి, ఒక్కో కపిలగోవుని దానం చేసిన ఫలం అతడికి లభిస్తుంది. భాగవతంలోని అర్థశ్లోకాన్నిగానీ కనీసం పావుశ్లోకాన్నిగానీ శ్రవణం చేసినా చాలు వాడికి వెయ్యి ఆవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. పవిత్రమైన మనసుతో ప్రతిరోజూ భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని పరించినా అతడికి పద్దెనిమిది పురాణాలు పఠించినంత పుణ్యం కలుగుతుంది. ఎక్కడ ప్రతిరోజూ నా దివ్యకథలు వినబడుతుంటాయో ఎవరు భాగవత పురాణాన్ని పూజిస్తూ వుంటారో వారు కలిప్రభావానికి గురికారు. ఎవరు తమ ఇంట్లో భాగవతపురాణాన్ని శ్రద్ధగా పూజిస్తారో వారు అన్ని పాపాలనుంచీ విముక్తి పొందుతారు. దేవతలతో సైతం నమస్కరించబడతారు…ఎవరైతే నా భక్తులకు భాగవతపురాణాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తారో వారు వేలకోట్ల కల్పాల వరకూ నా దివ్య వైకుంఠధామంలో నివసిస్తారు . కీర్తి, ధర్మం, విజయం, పాపక్షయం కావాలనుకునేవారు నా దివ్యకథలతో కూడిన భాగవత పురాణాన్ని శ్రవణం చేయాలి.

యం. ఈశ్వర్ చంద్ర గౌడ్, యం.ఎ పురాణేతిహాసా విభాగము, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*