ఈ సృష్టిలోని ప్రతి మహిళ నాకు ఇన్స్పిరేషనే : RJ దివ్య

ఆమె గొంతు వినడానికి శ్రోతలు ఎదురు చూస్తుంటారు
చాక్లెట్ బేబీ కోసం చాకోలెట్స్ గిఫ్ట్ ఇస్తారు
సొట్ట బుగ్గలతో అందంగా నవ్వే ఆమె లైవ్ అంటే చాలు అదో జోష్

ఆమె RJ దివ్య. ఈక్షణం కోసం ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ

హలో దివ్య
హాయ్

మీ రేడియో పేరు?
Dimple దివ్య

చాలా ఏళ్ళుగా రేడియో జాకీ గా చేస్తున్నారు, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది?.

నేను నిజాం కాలేజ్ లో డిగ్రీ చేస్తుండగా కర్నాటక సంగీతం నేర్చుకోవాలని రామకోటి మ్యూజికల్ కాలేజ్ లో చేరాను. అక్కడ మా గురువుగారు లలిత గారు ఆల్ ఇండియా రేడియో గురించి గొప్పగా చెబుతూ ఉండేవారు. మా అక్కయ్య Dr అనురాధ గారు ఆల్ ఇండియా రేడియో కోసం ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేసేవారు. అక్కతో నేను వెళ్లేదాన్ని. చాలా పాజిటివ్ వాతావరణం, గుడిలోకి వెళ్తే కలిగే ప్రశాంతత, అన్నింటికీ మించి ఒక దైవత్వం. అందుకే అక్కడ జాబ్ చేయాలనుకున్న. లక్కీ గా రేడియో జాకీగా ఛాన్స్ వచ్చింది. ఈ జర్నీ లో.. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్ రవిప్రకాష్ గారు, రాంబాబు గారు, సుమనస్పతి రెడ్డి గారిని మర్చిపోలేను.

మీ ఫ్యామిలీ, చదువు?

నేను పుట్టింది వరంగల్ జిల్లా. 5th క్లాస్ నుండి పీజీ, రేడియో, బ్యాంకు జాబ్, పెళ్లి.. అన్ని హైదరాబాద్. నాన్న రైల్వేస్‌లో పని చేసేవారు, అమ్మ గృహిణి. అయిదుగురు పిల్లలం, నేను చిన్నదాన్ని. మాకు ఒక పాప.

మీ ఫస్ట్ జాబ్?

రేడియోనే. నా మొట్టమొదటి జీతం ఎప్పటికి మర్చిపోలేను 550/- వినడానికి చాలా చిన్న అమౌంట్ కానీ అది నాకు ఎప్పటికి అమూల్యమైనదే. ఆ టైంలో తల్లిదండ్రులు, ఆత్మీయులు ఎన్ని వేలు ఇచ్చినా స్వయంకృషితో సంపాదించే దాంట్లో సంతృప్తి వేరే. ఎంతో సాధించాం అనే ఫీలింగ్.


మీరు రేడియో జాకీ అవుతారని అనుకున్నారా?

అస్సలు అనుకోలేదు. సంగీతంపై మక్కువతో లలిత గీతాలైనా రేడియోలో పాడాలి అనుకున్నాను.


ప్రైవేట్ రేడియో స్టేషన్స్ లో ఆఫర్ వచ్చినట్టుంది?

అవును. అయితే నాకు ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బో తో వున్న అనుబంధం వేరే చోటుకి వెళ్లనివ్వలేదు. అందుకే ఆ ఆఫర్స్ ని వదిలేసుకున్నాను.

బ్యాంకులో జాబ్ చేసేవారు కదా?

నాలుగు బ్యాంక్స్ లో పనిచేసాను. ప్రతి పొజిషన్లో ఎలా అయితే అనుభవం తెచ్చుకున్నానో అంతకు మించి బ్యాంకు కస్టమర్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయే మేనేజర్ గా పేరు తెచ్చుకున్నాను.

అటు బ్యాంకు జాబ్ ఇటు రేడియో ఎలా మేనేజ్ చేసేవారు?

బ్యాంకు జాబ్ జీవితం అయితే దాన్ని నడిపేది రేడియో. రేడియో జీవం పోస్తుంది, ఒక బూస్టర్ లా పనిచేస్తుంది. నా వాయిస్ స్కిల్స్, ప్రెసెంటేషన్… ముఖ్యంగా ఎదుటివారు మాట్లాడుతుంటే వినటం నేను రేడియోలో నేర్చుకున్నవే. వర్క్ చేసిన అన్ని బ్యాంక్స్ నన్ను చాలా ప్రోత్సహించాయి. ఎక్కడ పనిచేసినా అక్కడ నేనే కల్చరల్ ఈవెంట్స్ చూసుకునేదాన్ని. అలా మంచి పేరు సంపాదించుకున్నాను. అన్నింటి వెనక రేడియోనే ఉంది. అందుకే టైం మేనేజ్ చేయడం కష్టం కాలేదు.

టీవీలో వర్క్ చేసారు, ఆ ఎక్స్పీరియన్స్?

నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కొన్ని రోజులు పని చేశాను. ATV, ZeeTv సీరియల్స్ కి వాయిస్ ఇచ్చాను.

‘స్టార్ మహిళ’ అనిపించుకున్నారు, ఆ వివరాలు

ఈటీవీ ‘స్టార్ మహిళ’ 1000 ఎపిసోడ్స్ స్పెషల్ షో వుండింది. రేడియో జాకీ ఫ్రెండ్స్ అందరం ఆ షోలో పార్టిసిపేట్ చేసాము. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రెషర్ కుక్కర్ గెలుచుకున్నాను.

https://www.youtube.com/watch?v=RfHmAsP7qYo&feature=youtu.be

మీరు సింగర్ కూడా కదా?

నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. చానెల్స్ కి వాయిస్ ఇచ్చినప్పుడు ఒకసారి చిన్న బిట్ పాడాను.

సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది?

నాకు పరిచయం వున్న డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, డబ్బింగ్ ఆర్టిస్ట్ విజయమాధవిగారు నాకు ఛాన్స్ ఇచ్చారు. సాంగ్ లో యాక్ట్ కూడా చేశాను. త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ‘నరసింహపురం’ సినిమాలో నన్ను చూడొచ్చు.

మీరు పాడిన మీ ఫ్యావరెట్ సాంగ్ ?

ప్రస్తుతం రేడియోలో ఏ షో చేస్తున్నారు? టైమింగ్స్?

ఆల్ ఇండియా రేడియో, రెయిన్బో FM 101.9 లో.. సింగిడి షో (12-4pm) చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ షో.

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్?

మంచి ఆదరణ పొందిన టాపిక్స్ చాలా ఉన్నాయి.
1. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు?
2. వాలెంటైన్స్ డే రోజు మీరు రొటీన్ కి భిన్నంగా ఎలా ప్రపోజ్ చేస్తారు?

పబ్లిక్ తో మాట్లాడడం ఎలా అనిపిస్తుంది?

నాకు చాలా ఇష్టం. రెగ్యులర్ కాలర్స్ కాకుండా.. తెలియని వాళ్ళతో కూడా హెసిటేషన్ లేకుండా మాట్లాడతాను. వారి జీవన విధానం, వాళ్ళు ఎలా కష్టపడి పైకొచ్చారు.. అని తెలుసుకోవటంలో ఎక్కువ దృష్టి పెడతాను. వాళ్ళ ఆలోచన విధానం, సక్సెస్ రేట్ గమనించొచ్చు. అవే నాకు ఇన్స్పిరేషనల్ టాపిక్స్ గా మారుతాయ్.

ఫ్యాన్స్ … ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది.

ఫ్యాన్స్ ఎక్కువే. చాలా మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళను ఇచ్చింది రేడియో. ఒకసారి ఇంటర్నేషనల్ చాక్లేట్ డే రోజు రేడియో స్టేషన్ కి చాకోలెట్స్ తీసుకొని వచ్చారు.


మీకు గుర్తువుండిపోయిన ఒక ఇన్సిడెంట్.

నేను రేడియోలో సోలోగా ఆగస్ట్ 27th, 2007లో ఫస్ట్ షో చేశాను. అప్పటి నుంచి నాకో రెగ్యులర్ శ్రోత ఉన్నారు. నన్ను కలవాలని రిక్వెస్ట్ చేసేవారు. ఒకరోజు ఏకంగా ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చేసారు. అది దేవుడి ఫోటో ఫ్రేమ్. దానిపై నేను మిమ్మల్ని ఒక దేవతగా భావిస్తున్నాను అని రాసి ఉంది. అది ఎప్పటికి మర్చిపోలేను.

మీ గొంతు వినడానికే శ్రోతలు కాల్ చేస్తారట!

నా వాయిస్ క్లియర్ గా , పద ఉచ్చారణ బాగుంటుందని అంటారు. అందుకేనెమో నా వాయిస్ వినాలని కాల్ చేసే వాళ్ళు లేకపోలేదు.

చాలామందిని ఇంటర్వ్యూ చేసి వుంటారు .. అందులో మీకు బాగా నచ్చింది.

మీడియా, డాక్టర్స్, ఇంజనీర్స్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఇలా చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. లాక్ డౌన్ టైం లో, మా అక్క Dr అనురాధ గారు, నేను కల్సి చేసిన వివిధ రంగాల వ్యక్తులతో ఇంటర్వ్యూలు మంచి ఆదరణ పొందాయి.

మీ లైఫ్ లో రేడియో అంటే ఒక్క మాటలో?

ఒక ఆర్ట్. ముందు నువ్వు సంతృప్తి చెందితేనే ఎదుటివారిని సంతోషపెట్టగలవు.

మీ ఇన్స్పిరేషన్?

ఈ సృష్టిలోని ప్రతి ఒక్క మహిళ, అలాగే జీవితంలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో నాకు ఇన్స్పిరేషనే.

మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది?

నేను నిజమే మాట్లాడతాను. నిజంలోనే బ్రతుకుతాను. అయితే ఎదుటివారు నాకు చెప్పేది కూడా నిజాలే అనుకుంటాను. నమ్ముతాను. కానీ అందరూ అలాగే ఉండరు, అది తెలుసుకోవాలి. మార్చుకోవాలి.

మీలో మీకు నచ్చేది

ఎంత కష్టమొచ్చినా నవ్వుతూనే ఉంటాను. ఒంటరిగా పోరాడగలను అనే ధైర్యం అదే నా బలం.

మీ ఫ్యూచర్ ప్లాన్స్?

హ్యాపీగా ఉన్నాను RJ గా, బ్యాంకు మేనేజర్ గా. దేవుడు ఇంకా ఎనర్జీ ఇవ్వాలి. త్వరలో సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను.

RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్

భాష మీద పట్టు ఉండాలి. కేవలం ఒక భాష కాదు.. లోకల్ గా మాట్లాడే అన్నింటిపై గ్రిప్ వుండాలి. మాట్లాడే విధానం మనసుకి టచ్ అయ్యేలా ప్రెసెంట్ చేయగలగాలి. RJ అంటే మాట్లాడడమే కాదు వినడం కూడా.

చివరగా మీరు చెప్పాలని అనుకుంటున్నది?

ఆశ, ధైర్యం ఈ రెండు వున్న ప్రతి మనిషికి జీవితం భారంగా కాదు అందంగా కనపడుతుంది. అందుకే మనం అందరికి తమ జీవితాల్లో ధైర్యంగా ఉంటూ ఆశల్ని సాకారం ఎలా చేసుకోవాలో నేర్పించాలి.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*