
విశాఖ పట్టణం: కోరుకొండ రంగారావు. నవ్వుని పెంచాలి, నవ్వుని పంచాలని అనుకోనే రంగారావు గారు లాఫ్టర్ క్లబ్ స్థాపించి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
దేశవిదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో అందరి మన్ననలు పొందారు. ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు. ఏకధాటిగా ఒక గంటలో 654 జోకులు చెప్పి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
రికార్డులు వచ్చిన ఆనందం కంటే తాను చెప్పిన జోకులకు ప్రేక్షకుల ముఖంపై వచ్చే చిరునవ్వే తనకు పెద్ద అవార్డు అని చెప్తారు రంగారావు. అంతే కాక ఒక గంటలో 40 వేషాలతో మెప్పించి తనలోని నటుడికి కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. కోరుకొండ రంగారావు జీవిత ప్రయాణం ఆయన మాటల్లోనే…
Be the first to comment