
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌తో మాజీ బ్యాట్మంటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా భేటీ ఆయ్యారు. ఈ భేటిలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రాష్ట్ర క్రీడా శాఖ అనుమతి కోసం మంత్రికి తన ప్రతిపాదనలు అందించారు.
జ్వాలా గుత్తా అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాట్మంటన్ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణనిచ్చి, వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం బ్యాట్మంటన్లో సీఎం కప్‌ను నిర్వహిస్తామని అందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరపున అనుమతులు ఇవ్వాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు విజ్ఞప్తి చేసారు.
ఈ సందర్భంగా మంత్రి వి, శ్రీనివాస్ గౌడ్ జ్వాలా గుత్తా ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు.
Be the first to comment