దర్శకుడు ఎన్. శంకర్‌కు అభినందనలు

హైదరాబాద్: జయం మనదేరా సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ సినిమా దర్శకుడు ఎన్. శంకర్‌ను MBC UNITED FRONT అధ్యక్షుడు, జర్నలిస్ట్ కలుకూరి రాజు, ఛైర్మెన్ రాచకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరి వట్టికోటి శేఖర్, సినీగేయకవి మౌనశ్రీ మల్లిక్ కలుసుకున్నారు. అభినందనలు తెలియజేశారు. శనివారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్.శంకర్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభా వంతమైన దర్శకుడు అని ప్రముఖులు ప్రశంసించారు. తెలుగు సినిమాకు పరిశ్రమకు ఎన్‌కౌంటర్, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా వంటి మరుపురాని విజయాలను అందించిన దర్శకుడని కొనియాడారు. శంకర్ జీవితం సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. జయం మనదేరా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించిందని, హీరో వెంకటేష్ సినీ జీవితంలో మరుపురాని చిత్రంగా నిలిచిపోయిందని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జయం మనదేరా సినిమా ఒక ట్రెండు సృష్టించ కలిగించిందని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*