ఈ నెల 25న ప్రధాని మన్‌ కీ బాత్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రతినెలా ప్రజలతో పంచుకునే మన్‌ కీ బాత్ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించాలనుకునే విషయాలను ప్రజలు నమో యాప్ ద్వారా లేదా, మై గవ్ డాట్ ఇన్ ద్వారా కూడా పంపవచ్చు.

లేదంటే 1800-11-7800 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా ప్రజలు తమ ఆడియో సందేశం రికార్డ్ చేయవచ్చు.

ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*