
హైదరాబాద్: నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో నిర్మించిన సంత సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమా చూసిన వారంతా దర్శకుడిని అభినందించారు.
తెలంగాణ జీవితాన్ని తెర మీద చూపించడంలో దర్శకుడు ప్రవీణ్ చందర్ నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారని సినీ ప్రముఖులు అన్నారు.
సంత సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమా అవార్డులతో పాటు బాక్సాఫీసు విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు.
గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్ రాసిన పాటలు సాహిత్యపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నాయని, డాక్టర్ పసునూరి రవీందర్ సంభాషణలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు ప్రవీణ్ చందర్ తెలంగాణ గౌతమ్ ఘోష్ గా పిలవబడతారని చెప్పారు.
సినిమాలోని ప్రతి సన్నివేశం గుండెలకు హత్తుకొనేలా చిత్రీకరించడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంత ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోతుంది అని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు.
Be the first to comment