వంగర, లక్నేపల్లి గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే రిపోర్ట్‌పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న దివంగత ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ, స్వర్గీయ PV నరసింహారావు స్వగ్రామం వంగర, లక్నేపల్లి గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్‌లో రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో నిర్వహించారు. వంగర, లక్నేపల్లిలలో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు గారు, సత్యవతి రాథోడ్, PV కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సలహా, సూచనల మేరకు టూరిజం, కల్చరల్ శాఖ అధికారులు కన్సల్టేంట్ ల ద్వారా రూపొందించిన  ప్రాజెక్టు రిపోర్ట్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. CM కేసీఆర్ ఆలోచన విధానాల ప్రకారంగా స్వర్గీయ పి వి నరసింహారావు స్మారక కేంద్రం ప్రతిష్ట్మాతక పర్యాటక కేంద్రంగా ఉండాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. వంగర, లక్నేపల్లి లలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించబోతున్న టూరిజం ప్రాజెక్టులను కన్సల్టెంట్‌లు రూపొందించిన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. కన్సల్టెంట్ లు రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్ లను మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించి, వారి సూచనలు, సలహాల ప్రకారంగా తదుపరి చర్యలు చేపడుతామన్నారు.
 
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కన్సల్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*