
చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సమక్షంలో ఆమె పార్టీలో చేరతారని సమాచారం. ఇటీవలే ఆమె కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్థించారు. ప్రతిపక్షం కూడా దేశ భవిష్యత్తు కోసమే పనిచేయాలని కూడా అన్నారు.
దీంతో నాటి నుంచీ ఆమె తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉంది. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నందుకే ఖుష్బూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. అటు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో ఖుష్బూ బీజేపీలో చేరనుండటం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Be the first to comment