జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించే గుణాలు కృష్ణ బియ్యంలో పుష్కలం: ఆయుర్వేద నిపుణుల మాట

విజయవాడ:ఆయుర్వేదము సనాతన వైద్య శాస్త్రము అనగా చిరపురాతనము నిత్యనూతనము మానవుడు నూరు సంవత్సరములు జీవించాలి అనుకోవడం తప్పేమీకాదు . కానీ బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడం ముఖ్యం.

“సర్వ మేవ పరిత్యజ్య శరీరం అనుపాలయత్” అని చరకుడు అన్నాడు. అనగా అన్నిటికన్నా ముందు శరీరాన్ని సంరక్షించుకోవాలి. ఆయుర్వేదం ఒక జీవన శైలి. ఇందులో వ్యక్తి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏమేమి నియమాలు పాటించాలనేది స్పష్టంగా తెలుపబడినది.
ఈ కాలంలో అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

“ప్రాణినాం పునర్మూలమహారం” అనగా ఆహారం మన శరీరానికి ,ప్రాణాలకు మూలం అని అన్నారు.

మన రాష్ట్రంలో ఆహారంలో బియ్యం చాలా ఎక్కువగా ఉపయోగించబడుతోంది. చాలా రకాల బియ్యం యొక్క వివరణ మన వేదాలలో విస్తీర్ణంగా తెలుపబడింది. అందులో కృష్ణ బియ్యం ఒకటి.

కృష్ణ బియ్యం గుణాలు

1) త్రిదోషఘ్నము : మన శరీరంలోని సూక్ష్మ శక్తులు మూడు. వాతము, పిత్తము, కఫము ఇవి శరీరానికి మూలం ఇవి వి సమావస్థలో ఉండినచో శరీరాన్ని రక్షించి ఆరోగ్యానికి కారణమవుతాయి.

వాతము: ఇది శరీరంలో సంచరిస్తూ ఉంటుంది శరీరములో కదలికలకు ఇదే కారణం శ్వాస, రక్త ప్రసరణ, మాట, ఆంత్రప్రసరణ, వినికిడి మొదలగునవి.
సమావస్థలో లేనిచో ఇది నొప్పిని, రూక్షత్వాన్ని, నరాల బలహీనతను కలగజేస్తోంది.

పిత్తము: ఇది శరీరంలో శక్తిప్రవర్తనను చేస్తుంది అనగా జీవక్రియను నిర్వహిస్తుది. ఆలోచన శక్తి మనోభావాలు జీర్ణ ప్రక్రియలను నియంత్రిస్తుంది. సమావస్థలో లేనిచో అరుచి, జీర్ణ నాళములలో పుండ్లు, మందబుద్ధి, చర్మ వ్యాధులు మొదలగునవి సంభవిస్తాయి.

కఫము: ఇది శరీరములో సరళతను పెంచుతుంది అనగా ఎముకలు, కండరాలు, మెదడు మొదలైన వాటిని పోషిస్తుంది భౌతికంగా శరీరానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.సమావస్థలో లేనిచో శరీరంలోని ముఖ్య అవయవాలు (గుండె, మెదడు, ఎముకలు) ప్రభావితం అవుతాయి.

2) చక్షుష్యం:- కంటికి అనుసరించి ఉన్న రక్తనాళాలు కండరాలకు బలాన్ని చేకూర్చి దృష్టిని పెంచుతుంది. ఇందులోని జింక్, విటమిన్ ఏ, కాల్షియం దీనికి తోడ్పడుతుంది.

3) బలకరము:- బలం అనగా శరీర కర్మలయందు సామర్థ్యాన్ని పెంచటం, సర్వ ఇంద్రియాలను, దోషములను, ధాతువులను, మనసు, ఆత్మ అన్నింటికీ బలం చేకూర్చి సరళంగా, అత్యున్నతంగా పని చేయుటకు తోడ్పడుతుంది . రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యంథోసయనిన్స్, డైటరీ ఫైబర్స్, ఇరన్, జింక్, కాపర్, పొటాషియం దీనికి తోడ్పడతాయి.

4) వర్ణ కరము:- శరీరం యొక్క అలసటను తగ్గించి చర్మం యొక్క కాంతిని రక్త ప్రసరణను పెంచి అందాన్ని పెంపొందిస్తుంది, ఇందులోని జింక్, బి కాంప్లెక్స్, దీనికి కితోడ్పడతాయి.

5) వీర్య కరము:-మానవ శరీరంలోని జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందిస్తుంది. స్త్రీ, పురుషుల యొక్క బీజానికి పోషణ అందించి, సంతానప్రాప్తికి తోడ్పడుతుంది. పోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం దీనికి తోడ్పడతాయి.

-కాంతి శ్రీ గిల్డా, (9100372888), సుఖ ఆయుర్వేదిక్ క్లినిక్, భవానిపురం, విజయవాడ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*