తేలిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం.. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే!

కామారెడ్డి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం తేలింది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

Final Tally:

Kalvakuntla Kavitha. – 728

Laxminarayana P -. 56

Subhash Reddy B. -. 29

Invalid. -. 10

మరోవైపు కామారెడ్డిలో కల్వకుంట్ల కవితకు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళాలు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్ నేతృత్వంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి, కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే గణేష్ గుప్త కూడా ఉన్నారు. అంతకు ముందు కవిత నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అంతకు ముందు నిజామాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి, కవిత కౌంటింగ్ సరళిని పరిశీలించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*