అన్నదాన విధి గురించి స్పష్టంగా వివరించిన పద్మ పురాణం

ఓం సద్గురవే నమః

పద్మపురాణం వసుదేవసుతం దేవం కంసచాణూర మర్ధనమ్ | దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

పద్మపురాణాన్ని మొదటిగా పద్మకల్పంలో స్వాయంభువ మనువు బ్రహ్మకు బోధించారు.. హృదయం పద్మ సంజ్ఞతమ్ అన్నమాట ప్రకారం ఈ పద్మపురాణాన్ని శ్రీమహావిష్ణువు హృదయంతో ఈ పోల్చబడింది.

పద్మ పురాణం పేరెందుకు?

పురణ పురుషుడైన శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి మొదలై సృష్టి ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ పురాణం కనుక దీనికి పద్మపురాణం అని పేరు.. పాద్మం పంచాపంచాశత్సహస్రాణీ పాఠ్యతే అన్నప్రకారం ఈ పద్మపురాణం లో 55,000(యబది ఐదు వేల ) శ్లోకాలు ఉన్నాయి…

యథా పంచేంద్రియస్సర్వ : శరీరతి నిగద్యతే | తథేదం పంచభిః ఖండైరుదితం పాపనాశనం||

మానవునికి పంచేంద్రియలు ఎలాగో అదేవిధంగా ఈ పురాణం లో కూడా 5 ఖండాలు ఉన్నాయి.

అవి
(1) సృష్టిఖండంలో 82 అధ్యాయాలు
(2) భూమి ఖండం లో 125 అధ్యాయాలు
(3) స్వర్గ ఖండం 39 అధ్యాయాలు
(4) పాతాళ ఖండం లో అధ్యాయాలు113
(5) ఉత్తర ఖండం లో 282 అధ్యాయాలు ఉన్నాయి.

పద్మపురాణం లోని అధ్యాయాల సంఖ్య 641 అధ్యాయాలు కలవు. పద్మపురణంలో వర్ణించబడ్డ అంశాలు పితృవంశాల చరిత్ర -కర్ణ అర్జున జన్మ వృత్తాంతం- దక్షుడుచేసిన సృష్టి – క్షిరాసాగరా మథనం- గర్భనిశస్త్రీలు పాటించవలసిన నియమాలు – బ్రహ్మ సభా వర్ణనం గురుసేవ విధానం – త్రివిధ భక్తి స్వరూపం -గాయత్రి మంత్రం ఫలం౼ సరస్వతి తీర్థ మహిమ౼ కద్రువ సంతానం – మహాలక్ష్మి ఆవిర్భావం – అగస్త్యుడు సముద్రాన్ని త్రాగుట – అన్నదాన విధిశివుడు మీ ఆలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అని స్తుతించగా అడుగగా బ్రహ్మదేవుడు దాదాపుగా 108 క్షేత్రాల పేర్లు తెలిపాడు ..అందులో కొన్ని

(1) .పుష్కర క్షేత్రం – సురశ్రేష్ఠుడు
(2) గయా క్షేత్రాO – చతుర్ముఖుడు
( 3) భృగుకక్షం – పితామహుడు
(4) అగ్ర క్షేత్రం – పద్మహస్తుడు . ఇత్యాది క్షేత్రాలు ..

వృక్షాలు అవి ఇచ్చే ఫలితాలు మానవులు జీవితానికి రక్షణ పోషణ ఇచ్చేవి వృక్షాలు.
ఇవి ఎన్నో రకాలు వాటిలో కొన్ని చెట్లు నాటితే ఏ రకమైన ఫలితం వస్తుందో అంటే……

1.నేరేడు చెట్టు – ఆడపిల్లల సంతానానికి ప్రసాదిస్తుంది.
2.దానిమ్మ చెట్టు ఉత్తమమైన ,అనుకూలమైన భార్యనిస్తుంది.
3.పాల చెట్టు – ఆయుర్ధాన్ని పేపొందిస్తుంది.
4.ఉడుగా చెట్టు – వంశాన్ని వృద్ధిచేస్తుంది.
5.చందన వృక్షం- ఐశ్వరప్రదం
6.చండ్ర చెట్టు – వ్యాధుల్ని నిర్ములిస్తుంది
….తదితర వృక్షాల గురించి వర్ణింపబడ్డయి.

అన్నదానవిధి

అన్నాన్ని పెట్టేవాడు శ్రద్ధతో పెట్టాలి. అలా పెట్టినవాడే సరైన ఫలితాలు పొందుతాడు..బ్రాహ్మణుడికి స్వచ్ఛమైన వండిన అన్నాన్నే పెట్టాలి.
శ్రాద్ధ సమయంలో అన్నదాన విధి చదివినవాడికి ,అమావాస్య నాడు ఏకాగ్రతతో శ్రాద్ధం పెట్టినవాడు పితృదేవతల అనుగ్రహానికి పాత్రుడవుతాడు.
శ్లో’ దేవద్విజసమీపస్థోనస్యదాత విముచ్యతే | దానేన సంయుతా విప్రా: సుఖినో ధర్మ భాగిన:||

దేవతలు ( ఆలయాలు ) ద్విజుల సమీపంలో అన్నదానం చేసిన వారు ముక్తిని పొందుతారు. మేలుకొని ఉన్న ప్రమత్తుడై ఉన్న , సందర్భవశాన వచ్చి విన్న భక్తి లేనివాడేనా అన్నదానం గురించి వింటే చాలు పాపాల నుంచి విముక్తి పొందుతాడు. అన్నదానం చేసే విప్రులకు సుఖసంపదలు కలుగుతాయి.

గోపూజ మంత్రం గోపూజా మంత్రం సకలదేవతా స్వరూపిణి గోమాత, అన్ని రకాల శుభకార్యాలలో, పితృకార్యాలలో గోపూజచేస్తే శుభప్రదంగా ఉంటుంది. గోవుని నిత్యం పూజించే వారింట ఐశ్వర్యం స్థిరంగా నిలుస్తుంది. అలాంటి గోపూజని చేసేడప్పుడు ముందుగా గోవుకి స్నానం చేయించి, గంధాది ఉపచారాలు సమర్పించి అక్షతలతో శ్లో ` నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరభేదాభ్యఏవచ | నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః || ( శ్లో 415 , అధ్యాయం-34 ) ఈ మంత్రాన్ని పఠిస్తూ గోవుని భక్తి శ్రద్ధలతో పూజించాలి . ఈ విధంగా చేసినవాడు గోదానం చేసిన ఫలితం పొందుతాడు.


పద్మపురాణం ఫలశృతి.

యద్యదిష్టం పఠంత్యేతత్ శృణ్వంతి చ ముముక్షవః | లభంతే తత్తదేవాశు ప్రసాదాత్కమలాపతేః ||

ఏఏ కోరికలతో ఈ పద్మ పురాణాన్ని చదివిన, విన్న వారి కోరికలు లక్ష్మీపతి శ్రీహరి అనుగ్రహముతో నెరవేరుతాయి.

-బండి చాణుక్యచంద్రగుప్త యం.ఎ పురాణేతిహాసా విభాగము, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*