*ఎందుku  ఏమిti  ఎలాga….  కోపం*

If you are patient in one moment of anger, you will escape hundred days of sorrow.” – Chinese Proverb .
డిగ్రీలో నా మొదటి  quotation బుక్కులో మొదటిది. చాలా సందర్భాల్లో follow అయ్యేది. పనిచేస్తుంది కూడా.

“పెదవి దాటని మాటకు ప్రభువు నీవు
పెదవి దాటిన మాట ప్రభువు నీకు ”
ఇది నా పతిదేవుని నోట్లోంచి తరచూ వినిపించే quote. చాలా పద్దతిగా అదే పాటిస్తాడు.
మొదటిది అప్పటికి మాట్లాడవద్దని సూచించేది అయితే
రెండోది అసలు ఎప్పుడూ ఏమీ అనవద్దని సూచిస్తోంది.

రెండూ తప్పే…. 
ఎందుకంటే
రెండూ continous గా పాటించడం కష్టమే.
కానీ నేను చూసినంతలో కోపాన్ని అద్భుతంగా ‘వంచి’ ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉండి, ఉంచి చూపించిన వ్యక్తి, నా మొదటి యోగా గురువు, అరుణగారు. Balance with Ratio!
కోపం మనిషిలో ఉండే అహానికి pump కొట్టి, reason పనిచేయనివ్వకుండా, పంతాన్ని పెంచుతుంది. No doubt, ఆ పంతమే లేకపోతే చరిత్రలో సామాజిక అన్యాయం/అసమానతలు/కట్టుబాట్ల పట్ల, ఇన్ని movements వచ్చివుండేవే కాదు. ఇక్కడ గమనించాల్సింది మార్పు సాంఘికంగా,  నిర్మాణాత్మకంగా సాధించిన movements వల్ల సాధ్యపడ్డాయి కానీ, కేవలం కోపం వల్ల కాదు.
అలాగే వ్యక్తిపరంగా చుస్తే కూడా ఏదైనా సాధించిన వాళ్ళని కదిపితే వెనక ఒక కోపమో, అవమానమో, అవహేళనో, భయమో బయటపడుతుంది.

Temporary గా ‘కోపం’, పౌరుషంతో మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అది అలవాటుగా మారినప్పుడు. అలా మారినప్పుడు వాస్తవాలు మసకబారతాయి. ఆ అలవాటు continous process అయిపోతే మొదట ఆరోగ్య సమస్యలతో మొదలై , తర్వాత సాంఘికంగా, నెమ్మదిగా ఇంట్లో వాళ్లు దూరం జరుగుతారు.

భయం వేస్తె చెప్పం, ఏడిపిస్తారని.
ఆనందంగా ఉంటే సగమే చెప్తాం, అంతా చెప్తే దిష్టి తగులుతుందని…
విచారం.. వుండి, వుండి, ఏడిపించి అరుపులోకి దింపిస్తుంది.. దానికి లొంగి అరుస్తాం..
మరి కోపం వస్తే?

*ఏమిtii*
కోపం వస్తేనా?
– మాట్లాడటం మానేస్తాం,
– చేతిలో ఉన్నది విసిరేస్తాం.
– చెయ్యి కూడా చేసుకోవచ్చు.
– వెటకరిస్తాం.
– విమర్శిస్తాం
– ద్వేషిస్తాం
– food తినం.
– ఒకళ్ళ మీద ఉంటే ఇంకోళ్ళ మీద చూపిస్తాం.
– avoid చేస్తాం.
– complain చేస్తాం. (ఎందుకంటే మీ కోపానికి కారకులు మీ ఎదురుగా ఉండరుగా, ఉన్నా ఒక్కోసారి ఏమీ చేయలేరు, చెప్పే ధైర్యం ఉండదుగా)
-తర్వాత వ్యక్త పరచాలా? లేదా దాచి ఉంచాలా? వద్దా? లేదా ఏమీ జరగనట్టు నటించాలా? అని అలోచిస్తాం. ఈ పాయింట్ సంఘంలో అవతలివాళ్ళ స్థానం, మనం అవసరం బట్టీ మార్చుకుంటాం.
ఇన్ని చేస్తాం కానీ,  అసలెందుకు మనకు లేదా అవతలివాళ్ళకు కోపం వచ్చింది? కారణం ఏమిటీ అని మాత్రం ఎప్పుడూ ఆలోచించం. తిన్నగా అడగం. ఒకవేళ చెప్పినా, చెప్పిన వాళ్లదే పాపం అన్నట్టు ignore చేస్తాం.
అంత ఆలోచిస్తే, అడిగితే, చెప్తే అసలు మనమెంతలో ఉన్నామో తెలిసి ఆ దిశగా ప్రయత్నం సాగించాలి కదా మరి..

*ఎలాga*
అసలు కోపం యొక్క నిర్మాణం ఎలాగ ఏర్పడుతుంది, పనిచేస్తుంది? ఎలాంటి సందర్భాల్లో సంభవిస్తుంది?
-చాలా మటుకు సాంఘిక పరిస్థితుల్లో provoke  అవుతుంది
-రెండేళ్ల వయసులో, NO అని పిల్లలు దుందుడుకుగా చెప్పడం మొదలైనప్పటినుండి.
-ఆలస్యం అయితే పేచీ పెట్టడం, లేదా సహించలేకపోడం లాంటివి. ఇది నెమ్మదిగా డిమాండ్ లోకి దిగతుంది లేదా వెంటనే తీరిపోతే ego పెంచబడి ఓర్పు, సహనం తగ్గుతూ అరుపులోకి దిగుతుంది. కోపం ప్రదర్శన బలం అనుకుంటారు.
అలా పెరిగి పెద్దయినపుడు వాళ్లకు ప్రతిదీ, ప్రతిఒక్కరు ఆధిపత్యం, నియంత్రణ కోసం పోరాడే వాళ్ళల్లా కనిపించడం, యుద్దభూమిలా చూడ్డం మొదలవుతుంది.
-దీర్ఘకాలిక కోపానికి (chronic anger) ఎప్పుడూ సమర్ధన (justification) అవసరం. అందుకని తప్పులన్నీ ఎప్పుడూ పక్కవాళ్ళవే.
‘నావల్ల’ ఎప్పుడూ
“నీవల్లే” కింద మారిపోతుంది.
-అలాగే ఇంట్లో వాళ్ళను చూస్తూ నేర్చుకోవడం జరుగుతుంది.
-అలా చూస్తూ చూస్తూ పెరిగినప్పుడు, ప్రదర్శిస్తున్నపుడు, అది నార్మల్ కదా, ఫ్యామిలీలో ఉన్నదేగా, చిన్నప్పటి నుండీ అంతేగా అంటూ చుట్టూ ఉన్న వాళ్ళు label చేయడం.
-లేదా ఒక మోడల్ ని అనుకరించడం.
-ప్రతీకారం ఏర్పరచుకోవడం
-అభిప్రాయం వ్యక్తపరిచేటప్పుడు
-నెగెటివ్ ఫీలింగ్స్ (భావాలు) వ్యక్తపరచినప్పుడు
-సహకారం నిరాకరించినపుడు లేదా అడిగినప్పుడు
-మీకు కోపం తెప్పించే విషయంమాట్లాడుతున్నప్పుడు
-No చెప్పినప్పుడు
-ఒక ఐడియా చెప్పేటప్పుడు
-అర్హతను అనవసరంగా విమర్శించినప్పుడు.
-traffic jams, sounds, food allergies etc.

*ఎందుku?*
-ఒక భౌతిక లేదా భావోద్వేగ బాధకు అసంకల్పిత ప్రతిస్పందన. (Automatic response to physical or emotional pain)
– పరిస్థితులు అనుకూలించనపుడు.
– ఎవరైనా బెదిరించినప్పుడు/చాలా డిమాండ్ చేసినప్పుడు/expect చేసినప్పుడు.
– మనల్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తు మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.
– ప్రియమైన వస్తువుని లేదా వ్యక్తిని కోల్పోయినప్పుడు
– మొండితనం బాగా చూపిస్తున్నప్పుడు
– చులకనగా చూసి మాట్లాడినప్పుడు
– కావాలని నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేస్తూ దురుసుగా ప్రవర్తించినపుడు
– ద్వంద ప్రవృతి ప్రదర్శిస్తున్నప్పుడు
– మోసపోయినపుడు
– బద్దకంతో వారి వంతు చేయకపోవడం
– విమర్శిస్తూ కనీస గౌరవంతో చూడకపోవడం
– పక్షపాత వైఖరి ప్రేమ
– వారి కోసం నిరంతరం వేచి ఉండేలా చేయడం.

పరిస్థితులు + ఇంకా పైన చెప్పిన వాటి వల్ల కలిగే మన  ఆలోచనలు ఎలా సాగుతాయంటే…
1. మీరు victim(బాధితులు) అయ్యారు లేదా హాని కలిగించబడింది.
2. అవతలి వాళ్లు కావాలని మిమ్మల్ని హింసించారని బలంగా నమ్మడం
3. అవతలి వాళ్ళదే తప్పు, మిమ్మల్ని అర్ధం చేసుకుంటూ వేరేగా ప్రవర్తించి ఉండాల్సింది (మీ ప్రకారం) అని ప్రగాఢంగా నమ్మడం.
4. నిరంతరం అవతలి వాళ్ళని ఏమైనా అనే హక్కు నాకుంది అనుకోడం.

విషయం ఏమిటంటే పక్కవాళ్లకు జరిగితే, జరుగుతున్నపుడు అంత ఇంటెన్సిటీ కనపడదు  మనదాక వస్తే తప్ప.

ఎలా balance చేసుకోవాలో వచ్చే వారంలో to be contd…

మళ్ళీ కలుద్దాం. -స్రవంతి చాగంటి 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*