కలకలం.. గుట్కా అక్రమ రవాణా కేసులో నటుడు సచిన్ అరెస్ట్

హైదరాబాద్: గుట్కా అక్రమ రవాణా కేసులో నటుడు సచిన్‌ జోషి అరెస్ట్ అయ్యాడు. గుట్కా అక్రమ రవాణా చేస్తుండటంతో ముంబయిలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. సచిన్ అరెస్ట్ హైదరాబాద్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కలకలం సృష్టిస్తోంది.

 

ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.
సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు జరుపగా దుబాయ్ పారిపోయేందుకు యత్నిస్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు. సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు నమోదు చేశారు. అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు చేశారు. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉందని అధికారులు తెలిపారు.

బాలీవుడ్‌లో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్‌ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారనే టాక్‌ ఉంది.

ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సచిన్‌ జోషి `మౌనమేలనోయి`, `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్‌ పండు`, `ఆజాన్‌`, `జాక్‌పాట్‌`, `వీరప్పన్‌`, `వీడెవడు`, `నెక్ట్స్ ఏంటీ`, `అమావాస్‌` చిత్రాల్లో నటించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*