
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. వానలు, వరదల నేపథ్యంలో పరిస్థితిని తెలుగు రాష్ట్రాల సీఎంలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని ఉద్దేశించి నేను @TelanganaCMO KCR గారితో, @AndhraPradeshCM @ysjagan గారితో మాట్లాడాను.
వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇవ్వబడింది.
వర్ష బాధితుల క్షేమం కొరకై ప్రార్ధిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) October 14, 2020
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో, మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
అవసరమైన ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజలకు పూర్తి సహాయ, సహకారాలు అందించడానికి నరేంద్రమోదీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయ చర్యల కోసం కేంద్ర బలగాలను ఆదేశించినట్లు, అమిత్ షా తెలిపారు.
MHA is closely monitoring the situation in Telangana and Andhra Pradesh in the wake of heavy rainfalls. Modi government is committed to provide all possible assistance to the people of both the states in this hour of need. My thoughts and prayers are with those affected.
— Amit Shah (@AmitShah) October 14, 2020
హోం మంత్రి అమిత్ షా ఆదేశం మేరకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం, హైదరాబాద్కు వచ్చి, వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
During my visit to Mallikarjuna Nagar, Bapu Nagar, & Prem Nagar of Amberpet and Ratna Nagar of Nallakunta, interacted with residents who are distressed #HyderabadRains.
Will work closely with various departments to provide relief to the people. pic.twitter.com/brK26SuIT7
— G Kishan Reddy (@kishanreddybjp) October 14, 2020
సహాయ కార్యక్రమాలను కిషన్ రెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ, అధికారులను, సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ నేతలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Visited and interacted with the residents of Arundhati Nagar, Arvind Nagar & Suraj Nagar in Musheerabad, Hyderabad which have been severely affected by the torrential rains.
Spoke to the officials in the presence of the residents & assured to work together.#HyderabadRains pic.twitter.com/1GYkRqMw90
— G Kishan Reddy (@kishanreddybjp) October 14, 2020
భారత సైన్యం, ఎన్.డి.అర్.ఎఫ్ సిబ్బంది, ఇతర కేంద్ర బలగాలు వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Live: Visit to the rain affected area of Prem Nagar, Amberpet, Hyderabad. https://t.co/Omp0J9WSsQ
— G Kishan Reddy (@kishanreddybjp) October 14, 2020
Be the first to comment