
నామినేషన్ ర్యాలీ ఇది.. విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది
జీను ప్యాంటు – రబ్బరు చెప్పుల పిల్లలతోటే నిజామాబాద్ లో సీఎం బిడ్డ ఓడిపోయింది.
టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో బుల్లెట్ దిగాలి
దుబ్బాక ఎన్నికల తర్వాత కాషాయపు జెండా రెపరెపలాడాలి
దుబ్బాకలో డైలాగులు పేల్చిన బండి సంజయ్
అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు.
దుబ్బాక : ఉప ఎన్నికల్లో దుబ్బాక గడ్డ మీద కాషాయపు జెండానే ఎగరుతుందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశాడు. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. దుబ్బాక పురవీధుల గుండా వేలాది మందితో ర్యాలీ తీసి నామినేషన్ వేశారు రఘునందన్ రావు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వివరిస్తూ దుబ్బాకలో బీజేపీ గెలవడం ద్వారా అసెంబ్లీకి ఒక ప్రశ్నించే గొంతును పంపించే అవకాశం వచ్చిందని , సత్తా చూపే సమయం ఇదే అని సంజయ్ అన్నారు.
యువత ద్వారానే మార్పు సాధ్యమని , యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం తన కుటుంబ సభ్యులకు సీట్ల భర్తీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక ప్రజలు ఆశీర్వాదం ఉందని , బీజేపీ గెలుపు ఖాయం అయ్యిందని రఘునందన్ రావు అన్నారు .
ఈనెల పదహారు వరకు నామినేషన్లకు చివరి రోజుకాగా నవంబర్ మూడున ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత కూడా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు .
-సతీశ్ కుమార్, జర్నలిస్ట్, హైదరాబాద్( 95055 55285)
Be the first to comment