వేద వ్యవసాయంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం ప్రతిష్టాత్మక కార్యక్రమం

హైదరాబాద్: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతిష్టిత వ్యక్తులతో జాతి హితానికి తోడ్పడే అంశాలపై పెద్ద ఎత్తున వెబినార్‌లు చేపడ్తోంది. రిసర్జంట్ ఇండియా పేరుతో యువతను తట్టిలేపుతోంది. తాజాగా వేద వ్యవసాయంపై వెబినార్ నిర్వహించనుంది. ఈ నెల 18న ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కార్యక్రమంలో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ముఖ్యవక్తగా పాల్గొంటారని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు.

 

కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ( 86867 43452) ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామంలో ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న‌ కృష్ణ బియ్యాన్ని(న‌ల్ల బియ్యం) పండిస్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చ‌దువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తున్నారు.

కౌటిల్య ప్రయోగాలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు కూడా కౌటిల్య కృష్ణన్ చేస్తున్న వేద వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇటీవలే కౌటిల్య సాగుచేస్తున్న పొలాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కౌటిల్య ప్రయోగాలను ప్రశంసించారు. యువత వ్యవసాయంపై అది కూడా వేద వ్యవసాయంపై దృష్టి సారించడాన్ని ఆయన శ్లాఘించారు.

కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. ఫంక్షనల్ ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీ పడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చ‌ని సూచిస్తున్నారు. కృ‌షి భార‌తం సంస్థ తరపున ఆయన క్రమం తప్పకుండా వృ‌ష‌భోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

దేశంలోని రైతు సోదరులు వేద వ్యవసాయంపై వేదాల్లో ఉన్న రహస్యాలు తెలుసుకుని వ్యవసాయం చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయని కౌటిల్య చెబుతున్నారు.

మరో వక్తగా వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ బాలాజీ సుకుమార్ పాల్గొంటారు. వెబినార్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామి బోధమయానంద కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*