
హైదరాబాద్: కొండకు చిల్లు పడింది. హైదరాబాద్ మునిగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిరీతిలో హైదరాబాద్ కాస్తా హై ‘జలా’ బాద్ గా మారింది. రోడ్లు చెరువులను తలపించాయి. చెరువులు నదులు అయ్యాయి.లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలు కాస్తా వరద నీటిలో తేలియాడే చిన్నసైజు నౌకలు గా కనిపించాయి. నగరవాసులకు ఎన్నడూ లేని కష్టం వచ్చి పడింది. అపార్ట్మెంట్ సెల్లార్ లు కాస్త తటాకాలు గా మారిపోయాయి. రోడ్ల మీద నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. రాజధాని నగరంలో రెండు వందలకు పైగా కాలనీలది ఇదే దుస్థితి. అసలు ఏం జరిగింది…. ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం రాత్రి కల్లా అతి భారీ వర్షం గా మారి కొండకు చిల్లు పడినట్లుగా ఐదు గంటలపాటు దంచేసింది.ఇంతకుముందు సమీప కాలంలో ఇలాంటి జడివాన చూడలేదని అకస్మాత్తుగా పడిందని చెప్పుకుంటూపోతే సరే.
#HyderabadRains Update@NDRFHQ @ WORK 24x7x365
Because #EveryLifeMatters#WithUHyderabad #Committed2Serve🇮🇳#Respect4Elderly🙏🏻#Concern4Sick 🙏🏻@10thNdrf @HMOIndia @PIBHomeAffairs @ANI @PIBHyderabad @DDIndialive @DDIndialive @DDNewsHindi pic.twitter.com/FKFMflvt8Z
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
భూమి మీద పడిన వర్షపు నీరు బయటికి వెళ్లడానికి చెరువుల్లో కలవటానికి దారి ఉంటే సరే.. ఆ దారిని కాస్త మనం మూసేశాం. ఎప్పుడో వచ్చే వర్షం నీరు పోవడానికి మనం దారి వదలడం ఏంటని, మనం తొక్కిన అడ్డదార్లు ఇప్పుడు మన కొంపల్నే ముంచేశాయి.
అంటే మనల్ని మనమే ముంచు కుంటున్నాం..
#HyderabadRains Update@NDRFHQ @ WORK 24x7x365
RESCUE WORK @ CHANDRAYANGUTTA & FALAKNUMA AREA
Because #EveryLifeMatters#WithUHyderabad #Committed2Serve🇮🇳#Respect4Elderly🙏🏻#Concern4Sick 🙏🏻@10thNdrf @HMOIndia @PIBHomeAffairs @ANI @PIBHyderabad @DDIndialive @DDIndialive pic.twitter.com/5TXtVUbesk
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
అయినా హైదరాబాద్ రోడ్లు ,కాలనీలు చిన్న సైజు వర్షానికే నదులను తలపించడం మనకు కొత్తేమీ కాదు. వర్షాకాలంలో హైదరాబాద్ వాసులు నరకాన్ని చవిచూడటం ,జిహెచ్ఎంసి అధికారులు ఏదో చేసేశాం అనిపించటం సర్వసాధారణమే.
#Challenging task completed only with #commitment and #dedication. Efforts put by #ACP_Choutuppal with his @PochampallyPS staff and #NDRF saved the lives of 20 passengers of RTC bus stuck in a heavy #flood between Kothaguda-Pochampally.#CP_Rachakonda appreciated all. pic.twitter.com/ejAYfesHhj
— Rachakonda Police (@RachakondaCop) October 14, 2020
తిలాపాపం తలా పిడికెడు
అసలు హైదరాబాద్ నగరానికి ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? పురాతన డ్రైనేజీ వ్యవస్థ కు మోక్షం లేకపోవటమేనా? ఆనాడు నిజాం కాలం నాడు అప్పటికి సరిపడా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. అప్పట్లో పట్టణం గా ఉండే హైదరాబాద్ నగరం గా మారింది. ఆ తరువాత మహా నగరంగా రూపుదిద్దుకుంది మరో అడుగు ముందుకేసి విశ్వనగరం గా మారటానికి సిద్ధమవుతోంది. మరి గడచిన 50 సంవత్సరాలలో డ్రైనేజ్ వ్యవస్థలో ,నగర ప్రణాళిక లో వచ్చిన మార్పు ఏంటి… అంటే శూన్యమే కనిపిస్తోంది. కానీ జనాభా మాత్రం అత్యంత భారీగా పెరిగింది. ఇప్పటికీ ఈ దుస్థితికి అది ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటే ఇందులో 50 శాతం పైగా పాపం పాలకులదైతే, మరో 50 శాతం పాపం నిస్సందేహంగా ప్రజలదే….
#HyderabadRains Update@NDRFHQ @ WORK 24x7x365
Because #EveryLifeMatters#WithUHyderabad #Committed2Serve🇮🇳#Respect4Elderly🙏🏻#Concern4Sick 🙏🏻@10thNdrf @HMOIndia @PIBHomeAffairs @ANI @PIBHyderabad @DDIndialive @DDIndialive @DDNewsHindi pic.twitter.com/f3AUY4zEAb
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణ ,డ్రైనేజీలు మూసి వేస్తూ రోడ్డు వెడల్పు కార్యక్రమం ,ఇలా ఏదైతేనేం తిలాపాపం తలా పిడికెడు పంచుకుంటున్నారు. ఇండిపెండెంట్ గృహాలు అపార్ట్మెంట్ నిర్మాణాల లోనూ ఇంటిలో నీరు బయటకు వెళ్లాలన్న సృహ కూడా కోల్పోతున్నారు.అదీకాక లంచావతారాల పుణ్యమా అని అన్నీ అక్రమకట్టడాలే నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ ని ఆక్రమించి వెలిసే కట్టడాలే ఎక్కువయ్యాయి. చెరువులన్నీ ఆక్రమణలకు గురై, చెరువును పూడ్చి అపార్ట్మెంట్లు నివాసాలు నిర్మిస్తున్నారు. దీనంతటికీ పార్టీల పెద్దలు, పాలకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. చెరువులో ఇల్లు కట్టుకొని వర్షం వచ్చింది నా కొంప మునుగుతోంది అంటే ఎలా ఉంటుందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి.
#HyderabadRains Update
🔶74 persons rescued
🔶Bandangpet area
🔶Adults-29 (F-17 M-12)
🔶Children-30 (F-13,M-17)
🔶Sr Citizens-12(M-5 F-7)
🔶Animals-3 dogs
🔶#Committed2Serve🇮🇳
🔶#NDRFWithUHyderabad #EveryLifeMatters @10thNdrf @HMOIndia @PIBHomeAffairs @ANI @PIBHyderabad pic.twitter.com/afKOZQdbX3— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
రోడ్డెక్కిన నేతలు… జిహెచ్ఎంసి ఎన్నికల మహిమ
భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం ఆదరాబాదరా అధికారులు హడావుడి చేసి సహాయక చర్యలు మమ అనిపించటం అందరికీ తెలిసిందే. మరి ఈ మారు హైదరాబాద్ కు జలవిలయం వచ్చింది. ఇప్పుడు అధికారులతోపాటు అన్ని పార్టీల నేతల హడావుడి కూడా కనిపించింది. ప్రస్తుతం నేతలు స్పందిస్తున్న తీరు కొంత భిన్నంగానూ ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సహా కార్పొరేటర్లు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ మేమున్నాం అంటున్నారు. వివిధ పార్టీల నేతలు కూడా వరద ప్రాంతాల పర్యటనలో బిజీ బిజీ గా కనిపిస్తున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మలక్ పేట్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, స్థానికులతో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ మహమూద్ అలీ #HyderabadRains pic.twitter.com/Iz0aIZc0g9
— TRS Party (@trspartyonline) October 14, 2020
#HyderabadRains I was at a spot inspection in Mohammedia Hills, Bandlaguda where a private boundary wall fell resulting in death of 9 people & injuring 2. On my from there, I gave a lift to stranded bus passengers in Shamshabad, now I'm on my way to Talabkatta & Yesrab Nagar… pic.twitter.com/EVQCBdNTvB
— Asaduddin Owaisi (@asadowaisi) October 13, 2020
During my visit to Mallikarjuna Nagar, Bapu Nagar, & Prem Nagar of Amberpet and Ratna Nagar of Nallakunta, interacted with residents who are distressed #HyderabadRains.
Will work closely with various departments to provide relief to the people. pic.twitter.com/brK26SuIT7
— G Kishan Reddy (@kishanreddybjp) October 14, 2020
నేతల హడావుడి కి కారణం మాత్రం రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలే… నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వచ్చే ఈ మహానగర ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలకు ఈ విపత్తు కలిసి వచ్చింది. దాంతో అధికార టీఆర్ఎస్ నేతలు ఎంఐఎం నాయకులను వెంటేసుకొని పాతబస్తీ చుట్టి వచ్చారు. .. ఏదైనా ఎన్నికలంటే నేతలకు ప్రజల సమస్యలు వెంటనే కనిపిస్తాయి. మరి ఇదే నేతలు ముందుగానే మేలుకొని అభివృద్ధి నిధులతో అంతో ఇంతో చేసి ఉంటే ఈ కర్మ నగరవాసులకు కాస్తయినా తగ్గి ఉండేదేమో…. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా,,నేతలు వర్షాలు పడ్డప్పుడు ఉరుకులు పరుగులు కాక,ముందస్తు ప్రణాళికలు కాస్త రూపొందించుకుంటేనే హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది.
-వెలది కృష్ణకుమార్, సీనియర్ జర్నలిస్ట్, ( 98497 25984), హైదరాబాద్
Be the first to comment