దుబ్బాక తొలి మహిళా ఎమ్మెల్యే సోలిపేట సుజాత: హరీశ్ రావు

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ ముబారస్ పూర్‌లో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాతని, ఇందులో అలాంటి అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఢిల్లీలో, గల్లిలో ఏమీలేదన్నారు.

70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదని చెప్పారు. దేశంలో, కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా బీడీల పెన్షన్లు ఇవ్వడం లేదని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లా రాత్రి దొంగ కరెంట్ వస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడితే నేడు భాజపా మీటర్లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు.

కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్ అన్నారు. వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినపుడు కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి పోతారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తోంది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు.

సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూమి సిస్సు వసూలు చేస్తే, నేడు రైతుకు పెట్టుబడి సాయం చేసున్న ప్రభుత్వం టీఆర్ఎస్‌దేనని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్, భాజపా ఎండమావులు వంటివని, వారి వెంటపొతే ఏమి రాదన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసున్న టీఆర్ఎస్‌కే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*