ఎందుku  ఏమిti  ఎలాga….  కోపం (రెండవ భాగం)

ఈ సృష్టిలో ఎప్పుడు ఎవరికి ఎందుకు కోపం వస్తుందో ఊహించడం కష్టమే. అది పరిస్థితుల వల్లో, తత్వమో అనుకుంటూ ఆలోచించే తీరిక ప్రతిసారి ఎవరికైనా అసలు ఎందుకుండాలి?  ఉండక్కర్లేదు, ఉండాల్సిన అవసరమూ లేదు. ఎలా balance చేసుకుంటూ జీవించాలో తెలుస్తే చాలు. ఎందుకంటే మన కోపం నియంత్రించుకోడం ఎంత ముఖ్యమో, ప్రతిసారి పక్కవాళ్ళ కోపానికి బలైపోకుండా బ్రతకడం కూడా అంతే ముఖ్యం.

కోపంలో Levels ఎలా ఉంటాయంటే…

1. Furious (ఆగ్రహం): లోపల feeling – తనని తాను హింసించుకోవడం లేదా ఇతరులను హింసించడం.
బయట పడే రూపం – అరవడం, కేకలు, ఏడవడం.

2. Anger (కోపం): express చేయాలని ఉంటుంది కానీ ఎలాగో స్పష్టత (clarity) ఉండదు.
బయట పడేది – గుండెవేగంగా కొట్టుకోడం, దవడ బిగించడం.

3. Frustration: కావాల్సింది దొరక్కపోవడం, ఏదో చేద్దామన్న ప్రయత్నంతో పాటు, ఏమీ వద్దులే అన్న నిస్పృహ, dilema.
బయట పడేది – Restlessness

4. Upset (కలత) : సంతోషం ఉండదు. విచారం మొదలవుతుంది.
బయట పడేది – కంఠస్వరంలో

5. Annoy (ఇబ్బంది): ఏదో ఇబ్బంది పెడుతోంది, అది ఆగకపోతే కోపం లోకి దిగవచ్చు.
బయట పడేది – ముఖకవళికల్లో, మాట్లాడేవిధానంలో.

6. Calm (ప్రశాంతత) : విశ్రాంతిగా, ప్రశాంతంగా.
ఎట్నుండి ఎటు చదివినా ఇవి అందరూ ఎప్పుడో ఒకప్పుడు face చేసినవే.
పిల్లలకు ఎలా నేర్పించాలి ?
చిన్నప్పటి నుండే వాళ్లకి కోపం ఎలా express చేయాలో,  నియంత్రించుకోవాలో, దానికోసం practice చేయాల్సిన activities, coping skills నేర్పించాలి.

కోపం గురించిన వాస్తవాలు (facts) ఎలా వివరించాలంటే…
– అది ఒక emotion, దాని వల్ల ఒక్కోసారి చిరాకు(irritation), ఒత్తిడి (tension) ఆత్రుత (anxious) గా feel అవుతాము. -ve thoughts కూడా రావచ్చు….
-అదేమీ అంత చెడ్డది కాదు….
– దానికో ప్రవృత్తి ఉందీ, ఏదో మనని ఇబ్బంది పెడుతోందని body చెప్తోందీ… దాన్ని గ్రహించి సరి చూసుకోమని చెప్పాలి
-అలాగే అందరికి కోపం వస్తుంది అప్పుడప్పుడు అని చెప్తూ అలాంటి సందర్భాలు examples ఇవ్వడం లేదా కధల పుస్తకాలు ద్వారా నేర్పడం.
– Basic emotions గుర్తించడం.
Emoticons చూపించి, నేర్పించి, గీయించవచ్చు.
దీని వల్ల ఏ emotion అయినా
1. గుర్తించడం (identify)
2. వ్యక్తీకరించడం(express)
3. తీవ్రత స్థాయి (intensity) తెలుస్తుంది.
ఒక్కోసారి పరిష్కారం దొరకొచ్చు, లేకపోవచ్చు లేదా కారణం తెలియకపోవచ్చు కానీ ఎలా control (నియంత్రణ ) చేసుకోవాలో పద్ధతులు మాత్రం నేర్పించి తీరాల్సిందే.
అవేంటంటే
– పరిస్థితి,  పరిసరాలు నుండి temporary గా తప్పుకోవడం. తప్పుకొని సరిగ్గా ఉపయోగించడం అంటే book reading, clay mould, computer game, drawing etc..
– physical exercise
– రాసి, చించేయడం.
– సంతోషం కలిగించే జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం.
– Breathing. 4 inhale 4 exhale. పిల్లలకు ఎలా నేర్పించాలంటే మంచి సువాసన చూపించి పీల్చడం, candle or baloon ఇచ్చి exhale చేయమనడం…
– bubble blowing
– అన్ని forward bending యోగాసనాలు కోపం తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి.
– సింహగర్జన (lion roaring)
– ఉజ్జయి ప్రాణాయామం
– అనులోమ విలోమ ప్రాణాయామం.
మనలో emotion, personal survivalకు కారకమైన left brain, ముందు బుధ్ధినీ, తెలివినీ  పనిచేయనివ్వకుండా చేస్తుంది. Basic emotions ని ముందుకు తోస్తుంది.  దాన్ని సరి చేసి, balance చేయాలంటే ప్రాణాయామం ఒక్కటే చాలా బాగా పని చేస్తుంది. (Right handed వాళ్లకి left brain, left handed వాళ్లకి right brain కారకమవుతుంది)
ఒక విధంగా ప్రాణాయామం ఎవరిని ఎక్కడ, ఎంతలో ఉంచాలో, continousగా కావాలని hurt చేసేవాళ్ళని reject చేయాలా, దూరం పెట్టాలా అన్నది నేర్పిస్తుంది.
– పసుపు, ఆకుపచ్చ రంగు foods
– cooking
– ఏదైనా మనసుకు నచ్చే ఒక hobby.

పెద్దవాళ్లకు….
మనమేమీ special కాదు.
పాటించడం అంత easyనూ కాదు.
ఏ వయసులో అయినా, ఇబ్బంది వచ్చినపుడు, నేర్చుకుని implement చేయాల్సిందే.
పైన చెప్పిన వాటిలో యోగాసనం, ప్రాణాయామం తప్పనిసరిగా చేస్తూ, మిగతావి ఒక hobby లా క్రమం తప్పకుండా వారం లో ఒక మూడుసార్లైనా చేయవలసిందే.
హాస్యం.
మనని అర్ధం చేసుకుని తిట్టి, చెప్పే 2 or 3 స్నేహితులెవరో గుర్తించి, వారిని నిజాయితీగా, సహకారం కోరడం. వారికి తగినంత గుర్తింపు ఇచ్చి, సమయం కేటాయించి జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా important.

ఇక నాకు బాగా గుర్తుండిపోయిన, recent గా చదివిన చిన్న కధ.
కోపం బాగా ఎక్కువ ఉన్న కొడుకుతో ఒక తండ్రి, ఒక చెక్క ఇచ్చి, కోపం వచ్చిన ప్రతిసారి ఆ చెక్కకి ఒక మేకు కొట్టమని చెప్పాడు. ఆ కొడుకు మొదట్లో చాలా మేకులు కొట్టేవాడు. అలా కొన్నాళ్ళకి నెమ్మదిగా మేకులు కొట్టడం ఆగిపోయింది. ఆ అవసరం కూడా రాలేదు. తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పాడు మేకులు కొట్టడం ఆపేశాను అని. అప్పుడు ఆ తండ్రి చెప్పాడూ…  నీకు కోపమే రాలేదు అనుకున్న రోజు,  ఒక మేకు తీసేయమని. కొడుకు రోజుకో మేకు చొప్పున బయటికి తీస్తాడు. మొత్తం ఖాళీ అయిపోయాక, మళ్ళీ వెళ్లి తండ్రికి చెపుతాడు. అప్పుడు, ఆ  తండ్రి కొడుకుని తీసుకుని ఆ చెక్క దగ్గరికి వెళ్లి,  మేకులు తీసినా కనిపిస్తున్న రంధ్రాలు చూపించి చెప్తాడు. “కోపంతో అనే మాటలు, చెక్కమీద ఎప్పటికి పూడ్చలేని రంధ్రల్లా అలా ఎప్పటికి ఉండిపోతాయి, జాగ్రత్త!” అని చెపుతాడు. కొడుకు కోపం ప్రవృత్తి, విలువ తెలుసుకుంటాడు.

చివరిగా చిన్న మాట. ద్వేషం, ఇష్టపడకపోవడం, తిరస్కారం ఇలాంటివి, మీరూ, ఎదుటివాళ్ళు హాయిగా ఇచ్చి పుచ్చుకోవచ్చు. అది ధర్మం కూడా. తప్పులేదు. Guilt feel అవక్కర్లేదు. వాళ్ళు చేస్తే చమత్కారమూ, మనం చేస్తే బలాత్కారమూ కాదు. వాళ్ళని గౌరవిస్తూ, దూరంగా ఉండడం మానసిక ఆరోగ్యానికి అవసరం. కోపం పెట్టుకొని మీ time waste చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అనవసరమైన నటన చూపించి మీ time waste చేయడం లేదు కదా మరి.

మళ్ళీ కలుద్దాం

స్రవంతి చాగంటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*