ప్రతి వరద బాధిత ఇంటికీ పదివేలు

 

ఎన్ని కోట్లు ఖర్చయినా సరే

ఎన్ని లక్షలమంది వున్నా సరే

హైదరాబాద్ వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం…

పేదలను ఆపత్కాలంలో ఆదుకోవడం ప్రభుత్వ ప్రాధమిక విధి..

వందల యేండ్ల ఘోర విపత్తులో ప్రజలకు ప్రభుత్వం అండగా వుంటుంది

ప్రజాప్రతినిధులు అధికారులు యుద్దప్రాతిపదికన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి

టిఆరెస్ కార్యకర్తలూ సాయంలో భాగస్వాములు కావాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: భారీ వర్షాలు వరదల వ్లల హైద్రబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారనీ, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇండ్లల్లో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారనీ, ఇండ్లలోకి నీల్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికీ రూ. పదివేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని సిఎం వెల్లడించారు.

వానలు వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయని వారికి లక్ష రూపాయల చొప్పున పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.యాభై వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
దెబ్బతిన్న రహదారులు ఇతర మౌలిక వసతుల పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి తిరిగి మామూలు జీవన పరిస్థితలు నెలకొనేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ.550 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
‘‘ గడిచిన వందేల్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు బస్తీలలో వుండేవారు లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువగా కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాధమిక విధి, కష్టాల్లో వున్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించాం..’’
అని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సిఎం ఆదేశించారు. నగరంలో 200- 250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్లా ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.
పేదలకు సాయం అందించడం అతిముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైద్రాబాద్ నగరానికి మంత్రులు ఎమ్మెల్యేలు కార్పోరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సిఎం చెప్పారు.

నష్టపోయిన ప్రజలకు ఎంతమంది ఉన్నాసరే..లక్షల మందికైనా సరే.. సాయం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని సిఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబీకుల వివరాలు అధికారులకు చెప్పి సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. టిఆరెస్ కార్యకర్తలు నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బాధితులకు అండగా ఉండాలని సిఎం పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలేని వానలు వరద బాధిత పేదలకు సాయం అందించేందుకు ఆర్ధిక శాఖ రూ.550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*