అగ్రికల్చర్ యూనివర్సిటీ అవసరం లేకుండానే… పాలేకర్ స్ఫూర్తితో విజయవంతమైన మహిళా రైతు

సూర్యాపేట: తెలంగాణ సూర్యాపేట జిల్లా జనపహద్ పాలకవీడుకు చెందిన మహిళా రైతు అనితా సాదినేని భారతీయ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ విజయవంతమయ్యారు. దేశవాళీ విత్తన రక్షణే దేశ అభివృద్ధి అని అనిత కుటుంబం అంటోంది. ఈ రైతు కుటుంబం ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

 

తన వ్యవసాయ పద్ధతి గురించి అనిత కుమార్తె శైలజ మాటల్లో…

 

నేను హైదరాబాదులో బీఎస్సీ చదువుతున్నప్పుడు సుభాష్ పాలేకర్ గురించి విని నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత ఆయన పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకంలో రైతులకు జరిగిన మోసాలు, కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెలిసాయి. మా నాన్నకు కూడా కెమికల్స్ యొక్క ప్రభావం పడడం జరిగింది . ఆ తరువాత ఆ పుస్తకాన్ని తీసుకు వెళ్లి మా నాన్నకు ఇచ్చాను. ఆ పుస్తకాన్ని చదివి నేను ఒక సంవత్సరం ఒక పంట వేసి చూస్తానన్నారు. ఆర్గానిక్ సీడ్స్ హైదరాబాదులో ఉన్నట్లు నాకు తెలిసింది. సీడ్స్ తీసుకువచ్చి 2018 సంవత్సరంలో 5 ఎకరాల్లో పంట వేయడం జరిగింది. అప్పట్నుంచి పొలం దగ్గరే నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిసారి చాలా తక్కువ పంట చేతికి వచ్చింది. ప్రస్తుత పంటలు చాలా బాగా పండాయి. ఇప్పుడు గ్రామస్తులంతా మా పొలాన్ని చూస్తున్నారు. ఆ పంటను పండించే విధానాన్ని అన్నిటినీ తెలుసుకుంటున్నారు.

విత్తనాలు కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అవసరం లేదు ఆ విత్తనాలను మనమే తయారు చేసుకోవచ్చు. ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నందుకు, పంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. పంట వేసిన తర్వాత ఎంత లాభాలు వస్తాయి, ఎంత నష్టం వస్తుందోనన్న దిగులు లేదు. మా వద్ద ‌రత్నాచోడి, నవరా, నారాయణకమిని, కలబట్టి, మైసూర్ మల్లికా, మాపిల్లై సాంబా, కులకర్, సిద్ధ సన్నాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు సేంద్రీయ పద్ధతిలోనే పండించాలి. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. కల్తీ మందుల చేతిలో పెట్టకూడదు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*